Swami's Words

నేను స్వామిని  ఒక అయిదు నిముషములపైన ఏకధాటిగా మాట్లాడటం చూసింది చాల అరుదు. ఇక ఉపన్యాసముల సంగతి చెప్పనక్కరలేదు. స్వామి ఏమి చెప్పినా ఒకటి లేక రెండు వాక్యాలలో చెప్పేవారు. మనము చాల శ్రద్ధతో వాక్యాలని గ్రహించి, ఆలోచన చేస్తే మనకు మార్గదర్శనమౌతుంది. బహుశా 2007 లేదు ఒక సంవత్సరం అటు ఇటుగా, గురు పౌర్ణమి (ఆషాఢ పౌర్ణమి) సందర్భంగా స్వామి కొద్దిసేపు మాట్లాడారుదానిని యధాతధంగా కింద పొందుపరుస్తున్నాము.

"కాబట్టి మన ఓంకార రూపంతో పుట్టిన శరీరంలో గురువును ప్రతిష్టించుకుంటే పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్ముడు..ఎదో  ఒక మానవ రూపాన్ని మనము ఎన్నుకోవాల్సి ధర్మం వుంది. మన చూపు నిలబడేదానికి, మన బుద్ధి కుదుట వచ్చేదానికి, ఏకాగ్రత వచ్చేదానికి, తప్పుఒప్పు అని తెలుసుకుండేదానికి, ఏదైనా మనకు నచ్చిన ఒక నామస్మరణ రామ అను, కృష్ణ అను, గోవిందా అను, నారాయణ అను, సాయి అను, సద్గురుదేవ అను గోవిందా అను, ఏదైనా నీవు ఇష్టమైన రూపము పేరు పెట్టుకుని చేస్తే పరిగెత్తే మనసు ఒక కుదుటకు వస్తుంది, కుదుటకు వచ్చినప్పుడు తప్పుఒప్పు అని తెలుసుకునేదానికి మన లోపలే నిర్ణాయకర్త అయితాడు. అతడు ఎట్లాటివాడంటే

"పూర్ణచంద్రుడై పూజించువారలకు ప్రత్యక్షమౌ శ్రీసద్గురుమూర్తి "

ఎవరికీ ప్రత్యక్షమైతాడు? పూర్ణచంద్రుడై పూజించువారలకు...నా లోపలనే వున్నదని నేను గట్టిగా నమ్మి  పూజ చేస్తే ఆయన నాకు కావలసినవన్నీ ఇస్తాడు, కృతకృత్యుని చేస్తాడు, ధన్యుణ్ణి చేస్తాడు..సర్వుల్లో వున్నా సజీవ తత్వాన్ని మన లోపల ఉందని తెలుసుకునేదానికి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు సద్గురువు

"పూర్ణచంద్రుడై పూజించువారలకు ప్రత్యక్షమౌ శ్రీసద్గురుమూర్తి "
"దీని మూలంబే  సదా శివరామ నామమే "

రాముడు లేడు  శివుడు లేడు, సద శివరామ నామమే ...శివ అంటే మంగళకరమైన ప్రాణము
ప్రతి జీవిలో వున్న ప్రాణం నేనే అని సాయి ఎట్లా నిరూపించాడో... ..అదే సత్యమైనది ..ప్రతి జీవిలో వున్న ప్రాణమే నేను అని నిర్ణయయించిన సద్గురువు...అదే సదా శివరామ నామము శివ అంటే మంగళకరమైన ప్రాణము ... ప్రాణములో ప్రవహిస్తున్న ధ్వనిలో వచ్చే నాదం వచ్చి రామ శబ్దము.. చూసారా...ఎక్కడ వున్నాడు రాముడు..తన లోపల ఆడుతున్న ప్రాణవాయువులో సమ్మేళనంగా కలసి తల్లిగర్భంలో వున్నపుడు భగవంతుడైతే ప్రాణవాయువును పంపిస్తూ దానికి తోడుచేశాడో .. అదే ప్రాణవాయువును ఏమoటారంటే.. శివోహం ..శివా..సదాశివ.. ప్రపంచమంతా ఏలుతున్న సదాశివుడే నీవు నేను.. మనము అసంతృప్తితో మెలుగుతున్నాము...నేను జీవుణ్ణి..నేను కేవలము నీచుణ్ని...నాచేత ఏదికాదు అని అంటున్నారు..కాదు....అన్నిపనులు మనచేత అయ్యేటట్టు అతను ఇచ్చాడు, మనము నడవలేకపోతున్నాము....అయన మనలోపల అంతర్వాణిగా ఉండి ప్రేరేపణ చేసినది విని చెయ్యకపోతున్నాము.....తప్పు అని తెలియదా...ఇప్పుడు అక్కడ ఒక ఉంగరం వేశారు..దొరికింది నాకు..దొరుకుతే..భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఉంగరం తృప్తిగా వేలుకు పెట్టుకుంటున్నామేగాని ఇది ఎవరిది అని అడగటంలేదు...

ఎదుటివాణ్ణి నేను మోసం చేస్తున్నాను నాకు లక్ష రూపాయలు సంపాయించాను ..దానికి ఎంతో నాకు లాభం వచ్చింది అంటున్నావు ...వాడు నీవు రూపం వేరు గాని వస్తువు ఒక్కటే అని గ్రహించలేకపోతివి కదా ..ఇటువంటి మహనీయుల దగ్గరకు వచ్చి కూడా ...సద్గురువు సన్నిధికి వచ్చి కూడా మనం చెయ్యలేకపోతున్నాము .. నేను ఒక వ్యాపారం పెట్టాను  ..నేను కరెక్టుగా తూకం ఇస్తున్నాను ..నాకు ఒక్క రూపాయి ఆదాయం వస్తుంది ..వాడు కొంత తక్కువ ఇస్తున్నాడు వాడికి పది రూపాయలు వచ్చాయి ....కొంతకాలము.. ....సత్యం చావదు..నిజం నిలకడ మీద తెలుస్తుంది .... సత్యస్వరూపుడైన సద్గురువును మనలో  ప్రతిష్టించుకుని మనము నిత్యమూ ధ్యానం చేస్తూ వస్తే ఏమైతుంది...ఆయనను

"పూర్ణచంద్రుడై పూజించువారలకు ప్రత్యక్షమౌ శ్రీసద్గురుమూర్తి"
"దీని మూలంబే  సదా శివరామ నామమే " అది ఎంచూపిస్తుంది తెలుసునా "రమ్యమైన రహదారి" త్రోవలో  ఎవరు పోలేరు అది చాలా కఠినమైనది.... చాలా సులభమైనది ....చాలా సంతోషమైన మార్గం...రమ్యమైన రహదారి....ఎక్కడ చూపిస్తుంది?...

"తనలోనే తాను తన్మయత్వమెఱిగి  తర్కించి చూచిన తేటతెల్లమౌ తేజమొప్ప"...

మూడు లైనులు వచ్చినాయండి యాభైయేడులో ....ఈయనను యాభైనుంచి చేస్తే  ..ఈయాభైయేడులో ..మాకు గురువు రూపంతో వచ్చిన తరువాత .. మూడు లైనులు వచ్చినాయి ....రాలే ఇంక నాలుగోవాది..తిరిగి తిరిగి తిరిగి తిరిగి అలసి సొలసి అయన దాపు చేరితే ..అయన కూడా ఒక ఆరు నెలలు అయిన తరువాత విజయదశమిలో  ము0దుట్లో ..అక్కడ చెరువంతా నీళ్లు నిండింది .. అక్కడ ఒక రాయి వుంది.. రాయి మీద కూర్చుని ఉత్తర దిక్కులో కూర్చుంటే అప్పుడు వచ్చింది ...

"పండులోపల పండి పండువెలుపల పండి పండినపుడే ప్రకాశించు శ్రీ సద్గురుమూర్తివర్యా "

పండులోపల పండి....ఈడ పండాలంట.(తనలోపల చూపిస్తూ..) పండువెలుపల పండి...గాలి, ఎండా, వాన, .ఆకలిదప్పులు అన్ని అరికట్టేదానికి.. క్షుబాధని కూడా అరికట్టాలి పండులోపల పండి పండువెలుపల పండి.....పండి పండినపుడే .....పంట పండితేనే కదా కోస్తావు... ప్రకాశించు శ్రీ సద్గురుమూర్తివర్యా

ఇప్పుడు పరిగెత్తారు... ఇక్కడ ఎవడో  మీ మాదిరిగ వున్న ఎవరో ఒక రూపాన్ని చూస్తూ సత్యమైన సాయినాధుడు  ఇక్కడ ప్రతిష్టింపపడినాడని అందరం వచ్చి సాయినాథుని పూజిస్తున్నాము. సత్యస్వరూపుడు, నిత్యకల్యాణ స్వరూపుడు, సద్గురుమూర్తి మన హృదయంలో వున్నాడని మనకు తెలియజేస్తూ వస్తాడు.. తప్పుఒప్పు తప్పుఒప్పు అని చేసేదానికి మనకు మనసునిచ్చాడు. దేవతలకు మనసు లేదు, రాక్షసులకు మనసు లేదు ఒక్క మానవులకు మనసు వుంది ..విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు..రెండు చేతులపెట్టాడు శమదమాది గుణాలు పెట్టాడు.. కామక్రోధాదులు పెట్టాడు 

.. చెప్తాడు కృష్ణయ్య ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని .. కురుక్షేత్రం ఎక్కడ ఉంటుందో మనము చూడలేదు. మహాత్ములు అనుభవించి రాసిన గ్రంథాలను  ఆధారంగా చేసికొన్నాముగాని మనకి ఏమి తెలియదు. కానీ నా లోపల అనుభవాన్ని బట్టి చెప్తాను..ఎట్లా అంటే కురుక్షేత్రం అంటే, ధర్మానికి నిలయమైన హృదయము.. క్షేత్రము, క్షేత్రములో కామక్రోధాదులు ఒకతట్టు శమదమాది గుణాలు ఒకతట్టు..రోజూ  యుద్ధం చేస్తుంటాయి.. నేను పక్షంలో ఉంటే   పక్షానికి జయం....గుడ్డివాడైన అంటే కళ్ళులేనివాడైన  ద్రుతరాష్ట్రుడే ఏం చెప్పాడు ..తన బిడ్డలైన అజ్ణానులై అహంకారంతో  వున్నా దుర్యోధనాదులని కూడా ఏం చెప్పాడు, తండ్రేధర్మక్షేత్రే కురుక్షేత్రే  ధర్మానికి నిలయమైన క్షేత్రంలో అక్కడ  అధర్మమైన నా కొడుకులు యుద్ధం చేస్తున్నారు ... అయన ముందే చూపించాడు ..మన ధర్మక్షేత్రంలో ఆయన్ని వున్నాయి ..మనది క్షేత్రము.. హృదయంలో నిత్యమూ యుద్ధం జరుగుతున్నది .. యుద్ధం ఎక్కడ ఉందొ మాకు తెలియదు కానీ ..మా గురువుగారు చూపించింది ఇక్కడ జరుగుతున్నఈ హృదయంలో మాత్రం శమదమాది  గుణాలకు ఆటపట్టైతే  గెలుస్తాడు లేదా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్శ్యర్యము ...రావణాసురుడంటాడే దంభము, దర్పము, ఈర్యశ, జుగుప్త్స పదిగుణాలు నిన్ను ముంచి తెలుస్తాయిరా ...బంధువులoటివే బంధువులంతా ఎంతవరకు ఉంటారంటే అంతవరకుంటారు, అయితే ఎట్లా అన్నాడు.., ధర్మరాజు చెప్పాడు ..

 సత్యం మాతా పితా జ్ఞన ధర్మో భ్రాతా దయా సఖా
శంతిం పత్ని క్షమా పుత్రో షడయతె మమ బంధవాః

శాంతం అనే గుణం నీకు ఉంటే భార్య కన్నా ఎక్కువగా చూస్తారు, ఓర్పు ఉంటే కొడుకు కన్నా ఎక్కువగా చూస్తారు .................సత్యం, సత్యం నీ కంటిచూపులో వుంది సత్యం మాత.. తల్లి   ...........పిత జ్ఞాన, మన లోపల వుండే జ్ఞానం ...దయ సఖ..స్నేహితుడుగా ఉంటాడు

చూసావా ఆరు గుణాలు మనము సంపాయించుకుంటే, పది గుణాలు వదలి ఆరు గుణాలు సంపాయించుకుంటే..ఆటపట్టై యుద్ధంలో గెలుస్తాము ...యుద్ధంలో గెలుస్తామా రాజ్యం ఎలుతాము యుద్ధంలో చస్తిమా స్వర్గం వస్తుంది ..ఒక చీమ చుడండి పీపీలికము ...పానకం తాగేదానికి దాని చుట్టూరా తిరుగుతుంది, సస్తానని భయపడుతోందా?    కానీ మనకేమో భయము, జీవుడు కదా.. o వాడు చంపుతాడేమో వీడు వచ్చి నా ఇల్లు ఆక్రమిస్తాడేమో .. పక్కన వున్నవాడు పూజిస్తాడోలేదో.. వాడు కుట్ర పన్నుతున్నారు అని వీడు సంశయాత్మకుడై కేవలం పరిపరివిధాలుగా మనసును పోగొట్టుకుని.. ఆదివ్యాధులు -----------   ఏకాగ్రత చేసుకొని మన హృదయంలో వున్నా సత్యస్వరూపుణ్ణి ప్రపంచమంతా చూస్తన్నాము చుట్టూ కానీ శరీరంలో ఉండి నడిపేవాణ్ణి మాత్రం చూడలేకున్నాము...అంత చూస్తున్నాము కానీ లోపల నడిపే ఆయనను చూడలేకుండా వున్నాడు

...అందుకే ఈయనను ఆశ్రయించాడు ..ఈయనను ఆశ్రయించే ముందట్లో ..చిన్నపుడు చేస్తే..ఈయన కొన్ని విషయాలు చెప్పి మరుగైనాడు ..మా తల్లి విషయంలో యాభైమూడులో  మరుగైనాడు తరువాత తల్లి కోసమైతే నువ్వు తపన పడిచేసావో ..అటువంటి తల్లులు అటువంటి తండ్రులు ప్రపంచంలో ఎంతోమంది వున్నారు ...వారి కష్టసుఖాలను దూరం చేసేదానికి కావలసిన ...ఇస్తాను ఎప్పుడు నీకు ఏది కావలెనా అది తినిపిస్తాను పాలు ఇస్తానో..నీళ్లు ఇస్తానో...పండు ఇస్తానో..నువ్వు దానితో తృప్తిగా ఉండి నాయందు ఏకాగ్రత చేస్తే ఎవరేది కావలసిన నెరవేరుతుంది ...అసాధ్యమైన కోరికలు కాదు ..సాధ్యమైన కోరికలు ..అని సద్గురువు కరుణ ప్రేమతో వరము ఇచ్చినందువల్ల ఇక్కడికి వచ్చాము. దీర్ఘ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా..ఎదురుగ వస్తే కూడా ఒక రెప్పపాటులో మరుగైతావుండింది ...ఆయమ్మకు తెలుసు ..ఆయమ్మ ఎదురుగ వస్తే..నాయన అయన ఎదురుగా పోవద్దు నాయన ..కాస్త ఓర్పుగా వుండండి..మీ మనసు ఏకాగ్రత  చేసినాక పోదురు...ఎం అంటే..మీరు పోయినప్పుడు ...ఆయనకిచ్చిన్న వారంతో మీ వ్యాధిని గుంజుకుంటాడు ...కానీ మీరు మనసు ఏకాగ్రత  లేకపోతె అయన తపన పడతాడు...మళ్ళా మీరు అనుభవిస్తారు.

మీరు ద్రుష్టిలోపం లేకుండా ఏకాగ్రతగా మనసునుంచి ...మీరు పరబ్రహ్మను, పరమాత్మను, సద్గురువును ...మీకు నచ్చిన రూపముతో...ఫలాని రూపంతో చేయమని మేము నిర్బంధించలేదు ...రామ అను..కృష్ణ అను..గంగమ్మ అను పోలేరమ్మ అను ఏదైనా సరే ఒక దీక్ష పట్టుదలతోఏదిరాలేదు ఒక గోడ మీద పసుపుతో అట్లాఅట్లా..అలికి ఒక చుక్కపెట్టు కుంకుమ బొట్టు అమ్మ అంటరా.. నీకు వస్తుందో బలం రాదోచూడు .. అది రాకపోతే మీరు శిక్షవిధిస్తే శరీరానికి అది అనుభవిస్తాను ఉమ్మ్...రేపే ప్రారంభించండి ....ఒక గోడ మీద...పటం కొనాలంటే డబ్బుకావాలి .....దానికి అంత పసుపు రుద్దుతాము కదా..పసుపు ఎట్లా తెస్తాము అంటే మనము పప్పులో ఉప్పులో వేసుకుంటాము కదా ..అది రుద్దుకుంటాము ...ఒక కుంకుమ బొట్టు పెట్టుకో ...తదేక దృష్టితో ఊరికే అట్లా చూస్తావుండు రెప్పకొట్టకుండా.. నీకు నచ్చిన పదం తిప్పు... కాలక్రమేణా  ఏమైతుందంటే...నీకు ఏకాగ్రత వచ్చినప్పుడు అక్కడ శున్యమైతుంది....అక్కడ పసుపులేదు కుంకుమబొట్టు లేదు..అది ఎప్పుడు అయిపోయిందో ..త్రికరణశుద్ధిగ మనసు వాక్కు కర్మ ఒకటైతే ..నాకు జయమైందని..ఎవరిమీదంటే వారిమీద విర్రవీగకుండా ...ప్రశాంతతతో...తోటివాడిని నువ్వు గౌరవిస్తూ వస్తే జన్మ సాఫల్యమైతుంది ..వచ్చినందుకు కీర్తి వసుంది..

చూడండి ఆయన ఎప్పుడో శరీరం లోపల మరుగుచేసి ..నేటికీ వెలుగుతున్నాడు ...ఈయన చుడండి ఎప్పుడో సమాధిలో ఉండి మన అందరిని రక్షించి కాపాడుతున్నాడు ...ఎక్కడ షిర్డీ లోఉండి ..మన అందరి హృదయాల్లో ఉండి ...అయితుందా...ఒక ఇండియానే కాదు ఖండఖండాంతరాలలో కూడా ఈయన పేరు మారుమ్రోగుతుంది సాయి..సాయి అంటే ఇసా ... ఇసా అంటే రుహుల్లా ..రాహు అంటే..జీవి ..జీవికి అధిపతి

లా ఇలాహ ఇల్లెల్ల ఇసా రూహుల్లా ..

తొంబయిదోవ పైగంబరు ఈయన ..తొంబయిదోవ పైగంబరు ఈయన ..అయితే తెలియదు.."లా ఇలాహ" ప్రపంచం పుడుతుంది సస్తోంది అది నేను కాదు "లా ఇలాహ ఇల్లెల్ల"..... "ఇసా రుహుల్లా"..ఇసా అంటే సాయి ..ఇసా అంటే సాయి ...రామ అంటే..మర అంటారే..సాయి ..రాహు ..జీవి .. జీవికి అధిపతి ... జీవికి అధిపతి అని వారు చెప్పినారే...మనకెట్లఅయ్యా అయితుందంటే ....ఈయన సమాధిలో పోతూ చెప్పాడు ..ఎవరైతే నా పేరు పిలిచి చేస్తారో ... పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మని ధ్యానించి నేను ముద్ద బంగారుగ అయన వద్దపెట్టాను...ఎవరైతే ...చేస్తారో..నా దాంట్లోంచి..నా అకౌంట్లోనుంచి వారికి అన్ని ప్రసాదించవలసిందని జగద్రక్షకుని ..ఆపద్భాంధవుని..అనాథరక్షకుని తన హృదయంలో నిలుపుకుని కూర్చున్నాడు ...సిద్ధపురుషుడు..యోగపురుషుడు..జ్ఞానాపురుషుడు ..అటువంటివారు..మనమందరము భక్తితో కొలిస్తే..తొంభైమూడులో పరుగు పరుగున పరిగెత్తే.ఒక రెప్పపాటులో వచ్చి కూర్చున్నాడు అక్కడ ప్రతిషిష్టింపపడ్డాడు..అక్కడ ప్రతిస్ష్టింపబడినదాని  హృదయంలో ప్రతిధిస్టింపపపడినాడని ...మనము జాగ్రత్తగా...అయన యొక్క సచ్చటఁరిత్రను ...అయన ఈవిధంగా నడచి మానను నడచామని ప్రబోధించాడో ...వాటిని మనము క్రమంగా..చేస్తూ చేస్తూ వస్తే..మనం కూడా అయన సేవకు అర్హులమైతాము ...ఇతర ప్రాణిని నొప్పించకుండా..సమదమాడి గుణాలకు మన మనసు ఆటపట్టై ..ఈకాగ్రతయు ..తరించేదానికి..మన జన్మ జాప్యల్యమైయేదానికి ....

సద్గురువు సన్నిధికి వచ్చాము ...గురు పౌర్ణమిలో మనమందరము ఐక్యంగా ఎట్లా సర్వేశ్వరుని ప్రార్థన చేస్తున్నామో ...పౌర్ణమి అంటే..తేజోస్వరూపమైన కాంతి ..మనలోపలే వుంది..కాలిబొటికేనా వేలి నుంచి కపాలం వరకు ఆడుతున్న సత్యమైతే ఉందొ ...అన్ని అవయాలు వున్నా బలాన్ని కేంద్రీకరించి కాపాలానికి ఎట్లా చేర్చాలనే దానిని తెలుసుకుండేదానికి ..సద్గురువును ఆశ్రయిస్తూ ...వారేం చెప్త్రంటే..ఈకాగ్రతగా నీలో ప్రవహిస్తున్నది ..దానిలో నన్ను జత చెయ్యి ..మనసును..నీ మనసులో కుదుటగా జత చేసి..అంటే..ఎదో ఒక పేరుతొ నన్ను పిలిస్తే...నేను వస్తాను..అయ్యా ...రూపణామక్రియలు లేని నిన్ను నేను ఎట్లయ్యా నిన్ను పిలిచేడి అని ....అరెరెరె..నీకు అవయాలు అన్ని వున్నపుడు నేను వేరే రూపంతో వస్తే నీవు ఎట్లా తెలుసుకుంటావురా....నేను అవయలతో వస్తేనే తెల్సుకుంటావు అని ఎదో ఒక రూపంతో వచ్చి ..అయన మనల్ని సవరిస్తాడు ..మనకు కావసినవి అందిస్తాడు ....చెయ్యవలసిన కర్తవయము ..డ్యూటీ..నేను చేసినను ఫలితము వస్తుంది అని మాత్రం ఆశించవద్దు ...మనము ప్రతిఫలము కోరకుండా పని చేసేది మన వంతు ..దానియొక్క ఫలితము కొరవద్దు ...నేను అని అహంకారాన్ని చొప్పించుకోవద్దు శరీరానికి ...శరీరములో వున్నపుడు ..అవయాలు విధంగా గంతులు వేస్తున్నాయి ...అతడు తొలిగిపోయినప్పుడు అయితుంది ....ఏంటయ్యా ..గాలే కదా తొలిగిపోయింది ...ఆన్ అంటావు ..చూడు చల్లని...గాలి వస్తావుంది ...ఆగాలి మన ముక్కురంద్రాలలో వేసి అదించచ్చుకదా ఎవరైనా ..ఎవరు చేసేది ..ఒకడు వున్నాడు కదా ,,సృష్టికర్త ...ఇవన్నీ మనము పేరుతోయైన పిలుచుకో ... పేరుతొ పిలిస్తే.. పేరుతొ పలుకుతాడు.. మానని చెంతకు చేర్చుకుంటాడు ...మన కామక్రోధాదులను దూరం చేస్తాడు ...మనకు ప్రసాదిస్తాడు ...నిరంతరమూ తోడునీడగ వుంది నడిపిస్తాడని నా దృఢమైన విశ్వాసము ...అయన నడిపిస్తున్నాడు...

నేను తెచ్చుకుంటాను సొత్తు ..నీకెందుకని ప్రశ్నించాడు ...అయన తెచ్చుకున్నాడు... తెచ్చుకుంటాడు.. చేయించుకుంటాడు.. నీకేమిటి వ్యామోహం అన్నాడు ...నాకేం వ్యామోహం లేదు.. వ్యామోహం లేదు.. ఇప్పుడు మీ దెగ్గర ఒక బిడ్డ ఉంటాడు నాగలేస్తావు గుడ్డలేస్తావు...మంచి ఆహరం పెడ్తవు ...ఆనందంగా బిడ్డను ఊయలలో వేసి ఊపితే ..బాబు నిద్రపోతే ఆనందంగా చూస్తావుకదా ..అటువంటి తత్వాన్ని మాకు ఇచ్చాడు... చిన్ని బాబుగా వచ్చి .. అందుకే ఇప్పుడు ఎప్పుడైనా... పెట్టి చూడాలని ఆపేక్ష వుంటింది ..ఎందుకు మానవ జన్మ ఎత్తినందువల్ల ..మనసు ఉన్నందువల్ల..ఎంత ఏకాగ్రతయినప్పడికి కూడా...అయ్యో నా బిడ్డకి చొక్కాలేకపోయానే ..అని అంటాడు కదా .. అట్లాగ అయన దగ్గర ...లేనప్పుడు ఒకరకంగా ఉంటుంది..రుద్రాక్షమల లేనప్పుడు..మెళ్ళో దండలు లేనప్పుడు... నీ బంగారు అంత తీసుకుపోయి లోకెర్లో పెట్టారే.. నన్ను నమ్మలే కదా, నువ్వు లోకెర్లో పెట్టించుకున్నావు ...నిన్ను నమ్మలేకకాదు.. ప్రపంచం యొక్క దోపిడీకి భయపడి..లోకంలో చూపించేదానికి కొరకు పని చేసారు..కాస్తఅగు ఓర్పుపట్టు అంటున్నాడు..ఎక్కడ పారేసిన అక్కడ ఉంటుందిలే ..కాస్తవుండు ..కాలంకోసం కాచుకోవాలిగాని..కాలం మనకోసం కాచుకోదు కదా .. అని ప్రేరేపణ చేసి..నిలబెట్టినాడు


ఇటువంటి పుణ్యపురుషుని, జ్ఞానాపురుషుని, సిద్ధపురుషుని మనము నిరంతరమూ తలుస్తున్నాము ఈరోజు గురుపౌర్ణమిలో గుణరూపము..గుణము రూపము లేనివస్తువు మనలోపల ఆడుతావుంది..దానియొక్క లక్షణము స్వభావము తెలియాలంటే..మహామతుల చరిత్రలు, వారు నడచిన బాటలు ..రమణమహర్షి చేసాడు..రమణమహర్షి లీలామృతము వుంది..సాయిలీలామృతము వుంది..మహాత్ములు నడచినటువంటి ఉత్తరరామాయణము వుంది ..భారతము..భాగవతము వుంది..రామాయణములో రాముడు విధంగా నడచినాడో...దానిని మనము ఆధారంగా చేసుకొంటే ..తనను తాను తెలుసుకొనేదానికి రామాయణము... తనని తాను తెలుసుకొని సర్వజీవులను నడిపి తృప్తిగ చెయ్యాలంటే భాగవతం చెయ్యాలి .. కాబట్టి మనము భాగవతం, రామాయణాలు చేయాలంటే కాలంలో కాదు ..ఎదో ఒక నామస్మరణా..ఎదో ఒక పేరు.. ఎదో ఒక రూపము మనము చిత్రించుకుని చేస్తుంటే.. పేరుతొ పిలిస్తే.. పేరుతొ వస్తాడు ..అబ్బా దర్గాస్వామి మా ఇంట్లో పిలిస్తే..కలలో వచ్చి కానొచ్చాడు...దర్గాస్వామి యాడ కనొస్తాడు ..నువ్వు పిలిస్తే..నీలోపల సత్యస్వరూపుడు జగత్తుకు ఆధారమైన అయన నీవు ఏదైతే భ్రమ ఉందొ.. భ్రమతో వచ్చి  నీ కోరికను నెరవేర్చినాడు ..అయ్యా దర్గాస్వామి అని ఎందుకు నీకు కలిగించాడు అంటే ...దానియందు నీకు ప్రేమ ఉన్నందువల్ల ...తత్వాన్ని నిరూపించాడు.. పరబ్రహ్మత్స్వరూపుడు, పరమాత్మా, సద్గురువు దాన్ని తెలుసుకోవాలి ...దాన్ని మనము నిదానంగా గ్రహించి చేస్తాము ..జయమైతుంది ...అందరు కలసికట్టుగా ఎట్లా చేస్తున్నామో ..అవయాలో కలసికట్టుగా చేసి దాన్ని నెరవేర్చుకుందాము.

1 comment:

  1. శ్లో|| పూర్ణచమ్ద్రుడై పూజిమ్చువారలకు ప్రత్యక్షమౌ శ్రీసద్గురుమూర్తి
    దీనిమూలమ్బే శ్రీసదాశివరామ నామము రమ్యమైన రహదారి చూపును |
    తనలోనే తాను తర్కిమ్చి చూచిన తేటతెల్లమౌ తేజమొప్ప
    పమ్డులోపల పమ్డి పమ్డు వెలుపల పమ్డి పమ్డి పమ్డినప్పుడే ప్రకాశిమ్చు శ్రీసద్గురుమూర్తి ||

    ReplyDelete