Gita Discourse 1

శ్రీసద్గురుభ్యోనమః


శ్రీ సమర్ధ సద్గురు దర్గాస్వామివారు శ్రీమద్భగవద్గీతపై 2002-2003 సమయంలో ఒక సులభము, సరళము మరియూ  స్పష్టమైనప్రవచనమును యిచ్చియున్నారు. దాని వ్రాతప్రతి ఈ కింద ఇవ్వడమైనది. స్వామి ఇచ్చిన అసలు ప్రవచనము యొక్క వీడియోలు ఈ కింద లింక్లను క్లిక్ చేసి చూడవచ్చు. 


Part 1
Part 2
Part 3


నీ యొక్క ఆత్మకు చావు లేదు నాయనా. ఆత్మ స్థితి నువ్వు సక్రమంగా అర్ధం చేసుకొని నడచావంటే...... నీవు శరీరభ్రాంతిలో పడి నీ వెంటరాని వస్తువులను కోరుతూ నన్ను మైమరచావు. నన్ను ఒకతూరి రెప్పపాటుగా చూడు.  నీవు ఈ పద్దతిలో నీ మనస్సును ఏకాగ్రత చేసి నా రూపము యందును నా పదము యందును పెట్టావంటే నీకు చావులేని ఆ స్థితి ఎదైందీ నీకు అర్ధమైతుంది. నేను ఛస్తాను ఛస్తాను ఛస్తాను....  అని బాధ పడుతున్నావు. చచ్చేదేమిటి? జీవుడు చావడు. జీవునికి చావు లేదు. ఆ గురువంటే తను ఎప్పుడూ తన యందు ఆడుతున్న గుణ రూపములేని ఆ పరమాత్మునియొక్క తత్వo. 


శరీరము నేను గాదు. ఈ అవయవాలన్ని ఉన్నప్పటికి గూడా ఏదైతే తప్పిపోతే ఈ శరీరము ఈ అవయవాలు పలకవో అదే సత్య స్వరూపమని సాంఖ్య యోగ రీత్యా కృష్ణపరమాత్ముడు. ఆ కృష్ణపరమాత్ముడు 'శరీరము నీవు గాదు నాయనా!'  శరీరము నడుపుతున్న సత్యస్వరూపము నీవు - అని మనకు జ్ఞానోపదేశాన్ని చేసేదానికి మార్గాన్ని చూపించాడు. వాటిని మాత్రము మరువకుండా జ్ఞానస్థితిలో ఉన్నావంటే ఎల్లప్పుడూ నీదగ్గర సేవ చేస్తానని కృష్ణపరమాత్ముడు అర్జనునితో చెప్పాడు. 'తత్' అంటే భగవంతుని యొక్క స్వరూపము మానవునిలో ఏ విధంగా ప్రవేశించింది, దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలన్న పదాన్ని (సూచిస్తుంది). నాకర్ధంలేని స్థితికి పోతున్నానని ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఆయన యందు నిశ్చలత్వముగా కాలి బొటికినవేలు నుండి కపాలం దాకా కానస్తున్న సగుణరూపాన్ని. మనకవయవాలతో ఎట్లా ఉందో  ఆ పరమాత్ముడు గూడా కృష్ణరూపముతో మోహనరూపమతో మన ఎదురుగా నిలబడ్డాడు.


ఆయన యొక్క రూపాన్ని పాదం నుంచి కపాలం వరకూ చూస్తూ చూస్తూ (ఉంటే )మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానమంటే "శరీరము నేను కాదు, శరీరాన్ని నడుపుతున్న సత్యస్వరూపమే నేను" ఆన్న దృఢవిశ్వాసాన్ని మనకు పొందుపరుస్తాడు. ఆయన ప్రవచనాలు మనము వింటూ వింటూ వచ్చినప్పుడు మనలోపల ఉన్న సత్య స్వరూపాన్ని, స్థితిని మనకు కొంత ఒళ్ళుకుపడుతుంది. అప్పుడు ఒళ్ళుకుపట్టినప్పుడు ఇతర పనులయందు మనస్సు పోకుండా ఏకాగ్రతగా ఆయనయందు ఈ చిత్తము, మనస్సు, బుధ్ధి ఎప్పుడు కుదటగా ఉంచామో అహంకారము తొలిగిపోతుంది. అహంకారమంటే నేనని విర్రవీగకుండా శరీరమే నేనని విర్రవీగి విజృంభించి ఇతర ప్రాణిని నొప్పించకుండా జ్ఞానాన్ని ప్రసాదించి సర్వులు నీలోనే ఉన్నారు, నీవే ఆ సర్వులులో ఉన్నావని ఆయన నిరూపిస్తాడు. 


సన్యాసంటే ఏ కోరికపైన కూడా ఏ పనియందు చేసినా కూడా తనకు ఏలాంటి బాధ్యత లేదని నిర్ణయకర్త అయిన ఆ పరమేశ్వరుడు తత్ స్వరూపముగా ఉండి మనలను నడిపిస్తున్న ఆయన ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. ఎన్ని పనులు చేసినా ఆయనే చేయిస్తున్నాడనే దృఢచిత్తముతో, దృఢవైరాగ్యముతో ఆయన యందు సగుణరూపము యందు మన మనస్సుని ఏకాగ్రము చేస్తే ఆ రక్షకుడు, ఆ కృష్ణ పరబ్రహ్మము, ఆ పరమాత్ముడు, తత్వము యొక్క స్వరూపాన్ని మనకు నిలకడగా ఉండే దానికి కర్మసన్యాస యోగములో ఎన్ని కర్మలు చేసినప్పటికీ గూడా ఆ కర్మను నీవు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో అప్పుడు నువ్వు సన్యాసివైనట్లు. 



ఆ కృష్ణ పరమాత్ముడంటే ఎక్కడగాదు నీకు సద్బుద్ధిని ప్రసాదించినాడే సద్గురువు, అతడే కృష్ణుని రూపంలో మన యెదురుగా ఉండి నడిపిస్తున్నాడు. మనస్సు కుదట చేసి ఆయన యొక్క నిజస్థితిని చెవులారా విని, కంటితో రూపాన్ని చూస్తూ, మృదుమధురమైన ఆయన యొక్క పాదాలను మనము సర్వకాల సర్వావస్థలయందు మన చూపులో పెట్టుకొని ఆయన పదాన్ని మన హృదయమధ్యములో ఉంచుకొని ధ్యానిస్తూ వస్తే మనకు కావల్సిన యే యొక్క వస్తువు కావాలో ఆత్మ సమ్యోగము అది వచ్చేదానికి ఏ పద్ధతులలో మనము ఆచరించాల్నో ఆరవ అధ్యాయములో చెప్పాడు. ఏకాగ్రతగా ఒంటరిగా కూర్చుని తపస్సు చేయమన్నాడు. అక్కడ తనకు నచ్చిన ఒక ఆసనాన్ని నిర్మించుకోమన్నాడు. దానిపైన తదేక దృష్టితో తాను ఏ రూపాన్నయితే పతిష్ఠిమ్చుకున్నాడో ఆ రూపానియందు పదము, పాదాలు మనస్సులో హృదయ పూర్వకముగా ఉంచి ధ్యానిస్తూ వస్తే నిజ స్థితి తెలుస్తుంది.

శరీరము నేను కాను. నాకు భయము లేదు. వీరందరూ చంపుతారన్న(భయము వద్దు).. నాకు నిర్ణయకర్త నిర్ణయించినట్లు ఏ పనికైతే పంపాడో ఆ పని పూర్తయ్యేంతవరకు ఈ శరీరానికి ఇక్కడే ఉంచుతాడు. శరీర రీత్యా చేయవలసిన ధర్మాన్ని,న్యాయాన్ని సద్వినియోగముగా నేను ఏ పని చేయాల్నో ఏ ఏ పుణ్యపురుషులను తయారు చేయాల్నో వారినందరినీ తయారు చేసేంతవరకు ఆ కృష్ణపరమాత్ముడు ఈ హృదయములో ఆత్మ స్వరూపముగా ఉండి నెరవేరుస్తాడు అని పట్టుదలా,శ్రద్ధతో మానవుడు ముందడుగు వేయాలి. దాన్ని 'తత్' అంటారు.  భగవంతుడు తత్ రూపముగా.. తత్ తత్ ..ఆ భగవంతుడు మన హృదయములో ఈ విధముగా మార్గాన్ని చూపిస్తూ, భగవంతుని యొక్క లక్షణాలు మనకు అందజేసాడు కృష్ణపరమాత్మ. సత్యస్వరూపమైన ఆ దేవదేవుని యొక్క గుణగణాలు మన శరీరములో పెట్టి మన భయాన్ని తొలగించి స్థిరమైన నడకను తెచ్చి స్థితప్రజ్ఞుణ్ణి చేశాడు. స్థితప్రజ్ఞుడెప్పుడైతాడో.. ఇప్పుడు మనమందరమూ ఇక్కడ మాట్లాడుతున్నాము. ఒక సర్ప రూపముగా వేశాడు ఆయన. మనకేమైతుంది? కాటేస్తుందని పరిగెత్తుతాము గదా? దానికారూపమొచ్చిందని ఎవరైతే నిలబడతారో వాడే  స్థితప్రజ్ఞుడు.


సాయినాధుని దగ్గర అందరూ కూర్చున్నారు భోజనానికి పాపం ఆ సాయినాధుడు ఒక చిత్రం చేశాడు. అన్నీ కింద పడిపోయేటట్లు వచ్చినాయి. కిందపడిపోయేట్లు వస్తే అందరూ పరిగెత్తారు. ఆరు మంది మిగిలారు. వాళ్ళు భీతి చేత పోయారు. నువ్వు ఆగు. మేమందరము అయిన తర్వాత నువ్వు వస్తువు అని ఆయనను ఆజ్ఞాపించాడు. ఎవరు? గురువు. సాయినాఢుడు. ఈ తలభాగములో కపాలములో ఆయన ఎల్లప్పుడూ కూర్చుని ఆయన ఆ దుఃఖాన్ని పోగొట్టుటకై స్థితప్రజ్ఞుణ్ణి చేసి నీకు చావు లేదురా.. నువ్వు జ్ఞాన స్వరూపుడవు చూడు అని ఆయన కావల్సిన మార్గాన్నంతా ఉపదేశించి.. స్థితప్రజ్ఞుడు అంటే.. "సర్వ జీవుల్లో నేనే అన్ని రూపాల్లో వచ్చాను. అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. ఏ రూపమొచ్చినప్పటికీ గూడా నేనున్నానని గుర్తించు.  నీకేలాటి భయము లేదు. భయాన్ని పారద్రోలుకో. నువ్వు స్థితప్రజ్ఞుడువిగా." స్థిరచిత్తుడవుగా.  నన్ను తెలుసుకుంటావు అన్నాడు. 


ఏ కర్మ ఎంతవరకు ఆచరించాలో అంతవరకు ఆచరిస్తాము. అది వట్టిదని తెలుసుకొని దాన్ని వదిలి జ్ఞానానికి పోతాము. తత్తు..ఆ యొక్క పరమాత్ముని యొక్క స్వరూపాన్ని మనం మరిచామంటే ఆ మాయ ముంచుతుంది. శరీరము కదిలితే గదా.. శరీరము లేస్తే గదా దొంగతనానికి పోయేది. ఆ శరీరాన్ని హద్దులో పెట్టేదానికే భగవంతుని తత్వములో మనము విమర్శకముగా వెళ్ళాలి. ఆత్మ సమ్యోగములో కూడా చెప్పాడు జ్ఞానయోగములో గూడా చెప్పాడు హద్దుమీరి నువ్వు పోవద్దు. "బీ యిన్ ద లిమిట్స్" (Be in the limits). ఎదుటి ప్రాణిని నొప్పించద్దు. ఎదుటి ప్రాణిని నొప్పించకుండటమే కాకుండా నొప్పించకుండా చేతనైనంతవరకు సహకరించినవాడు త్యాగశీలుడైతాడు. ఎప్పుడు త్యాగశీలుడైతాడో అప్పుడు గీతాస్థానానికి కొంత ప్రవేశము దొరుకుతుంది.  ఏ పని అవసరమో ఆ పని తీసుకుంటాడు, మిగతా పనులంతా త్రోసిపెడతా వస్తాడు. సమస్తమూ చేస్తూ ఆ పరమాత్ముని చింతలో ఉండి ..ఎప్పుడొస్తాడు ..నువ్వు శుధ్ధి అయినప్పుడు నీకు ఏకాగ్రత వచ్చినప్పుడు వస్తాడు. మాటిమాటికి చింతించి దానిలోని నిజ స్థితిని తెలుసుకొన్నాడంటే వానికి చావు లేదు దృఢమైన జ్ఞానమొస్తుంది.



సమస్త పదార్ధములో తానే ఉన్నానని అర్ధము చేసుకొని చేసే కర్మ, ఏ కర్మ జేయాలో ఆ కర్మ చేస్తూ ఆచరణలో ఉంచుకున్నాడంటే అతనికి జ్ఞానమొస్తుంది. ఆ జ్ఞానమొచ్చేటప్పుడు ద్వేషము పోతుంది. కరుణా ప్రేమ ఉట్టిపడుతుంది. నీవు అందరికీ అనుకూలుడవైతావు. సర్వ జీవుల్లో ఉన్న సత్య స్వరూపమైన ఆత్మజ్ఞానానికి అర్హుడవైతావు. ముందు వాక్ మౌనము కట్టమనాడు. దీన్ని చాలా వరకు అరికడితే నీకు నేను దొరుకాతానంటాడు ఆ కృష్ణపరమాత్మ. వాక్ మౌనము ఎప్పుడైతే స్థిరపడి  నువ్వు స్తిరచిత్తుడువైనావంటే మనో మౌనము.

తత్ అనే విషయములో తెలియజేస్తూ ఆ ముడిని విప్పినాడంటే మనము కొన్ని అడుగులు ముందడుగు వేస్తాము. నా వెంటరాని వస్తువు ఇదే కదా అని విచార జ్ఞానముతో నువ్వు లోపల చిలికావంటే అప్పుడు ఒక ఉండ తయారవుతుంది..నీళ్ళ మీద, అదే వెన్న. మన మనస్సును ఆయన యందు ప్రీతితో ఉంచినప్పుడు మన మనస్సును ఆయన ఆరగించాడు. ఆయన స్వీకరించాడు. ఆయన తిన్నాడు. అప్పుడు మనకు తేజో స్వరూపమైన కాంతి వస్తుంది అప్పుడొస్తే అప్పుడేమైంది? మొట్టమొదట మనము వాక్ మౌనము కట్టాము. రెండవది మనో మౌనము కట్టాము. మూడవది ధ్యానయోగము. మనహృదయ మధ్యములో ఉండి ఆటలాడుతూ పాటలు పాడుతూ మనతో ఆడుకుంటూ పాడుకుంటూ మనలను నడిపిస్తాఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఈశరీరములో ఉన్నప్పుడు సగుణరూపముతో మనమున్నప్పుడు ఈ ప్రపంచ భ్రాంతులు మాయాదేవి అట్లా కొడుతుంది. ఆమె కొట్టినప్పుడు మనము భగవన్నామ స్మరణ ఏదైనా చేస్తే అది వెళ్ళిపోతుంది. అగ్నిలో జన్మించినవారు భగవంతునితో అన్నారు (మట్టితో మనవుని చేసి అతనికి నమస్కరించమన్నప్పుడు ) సరే అయితే, ‘ నీ బిడ్డ రెప్పపాటు నిన్ను మరిచిపోతే మేము వాణ్ణి తలక్రిందులు చేస్తామన్నారు’. రెప్పపాటు ఎంతసేపులో కొడుతుందో ఆ రెప్పపాటులో తలక్రిందులు చేస్తామన్నారు. ఆ పరమాత్మునితో వాళ్ళు శపధం చేశారు. సరైన తత్వములో తత్వాన్ని విమర్శ చేసుకొని సరైన పధ్ధతుల్లో నీ చేతలు ఆచరించు. సరైన పద్దతిలో ఈ పాదాల్ని ఆశ్రయించు.


అది సుషుమ్నా నాడి అది తెలుసుకోవాలంటే మానవుడు తత్ లక్షణాన్ని పూర్తిగా తెలుసుకునట్టే . భగవన్-నామ స్మరణ నిత్యమూచేస్తూ అక్క్డడ నుంచీ మనకు పెరుగుదల వస్తుంది. పెరుగుదల వస్తుందంటే జ్ఞానాన్ని తెలుసుకున్నఫ్ఫుడు యే ప్రాణిని నొప్పించవు. ఎనుబది నాలుగు లక్షల జీవులయందున్న ఆ పరమాత్ముడు నీలోన ఉన్న సత్యముతో వెలుగుతున్నాడు. అతడు నాలాంటి ఈ రూపముతో ఉన్నాడు. ఏ రూపములో ఉందినా ఆ రక్షకుడు ఆ రూపములో ఉండి నడిపిస్తున్నాడనే దృఢమైన భావన మనకు వస్తుంది. అప్పుడు మనము సమదృష్టి ఉంతుంది సమత్వము ఉంటుంది ఏకత్వము ఉంటుంది.

No comments:

Post a Comment