Directly From Swami



ఆ పరబ్రహ్మాన్ని కూడా అవయవాలు తీసుకుని నిర్వికారుడు, నిరంజనుడు, పరంజ్యోతి స్వరూపుడు, పరమాత్ముడంటే, అతను ఆ రూపంలో వున్నప్పుడు మనకు అర్హత ఉండదు. ఒక రోజు ఒక రూపాన్ని నేను చుస్తే, ఎప్పుడైనా దాని గూర్చి గుర్తుపెట్టుకునేదానికి ఉంటుంది. ఎప్పుడూ ఆ రూపాన్నే చూడనప్పుడు, ఆ కరుణే చూడనప్పుడు,  అది ఎట్లాటిది అని తెలుస్తుంది. కాబట్టి మనం శరీరంలో వచ్చినప్పుడు ఆయనను మనకి ఇష్టమైన పేరుతొ, రూపాన్ని మలచుకొని మన హృదయములో పెట్టుకుని మన చూపులో  పెట్టుకుంటూ, మనం చేసే అవయవాల్లో అయన గుణగణాల్ని చేర్చుకుంటే, ఒక పని చేయబోతాం, ఇది తప్పు కదా, ఇది ఆ మహనీయుడు చేయడు కదా అని  మనం చేయము. అలాగే క్రమక్రమంగా చేస్తుంటే అయన యొక్క లక్షణమొస్తుంది. గురువే బ్రహ్మరకీటకం, పాడు పురుగును తెచ్చుకుంటుంది . భయము చేతనో, భక్తి చేతనో, దాని  చూస్తూ చూస్తూ వస్తే దాని రూపాన్ని పొందుతుంది. మనం కూడా ఆయన గుణగణాలు మననం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, నిరంతరం మనలోపల వాటిని ఉపయోగపెడుతున్నాము. క్రమంగా చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే మన రక్తములో సమ్మేలనమైతుంది. మన అవయవాలు బలమోస్తుంది. తేజస్సు వస్తుంది. అప్పుడు మనకు శమదమాది గుణాలు అలవాటుపడతాయి. జయమైతుంది. 

భగవద్గీత భగవద్గీత అంటున్నాము. యుద్ధం జరుగుతా వుంది. గీతలో అంటే, అమ్ జరిగింది. కృష్ణ భగవానుడు సారధ్యం చేసాడు. పాండవుల తరపున, పుస్తకాలలో చదువుకున్నాము, అది యదార్ధమే. కానీ నిరంతరం మన లోపల జరిగే యుద్దాన్ని కూడా మనం కూడా చూడాలి. ఏమి యుద్ధం జరుగుతుందయ్యా? అంటే కామక్రోధాదులకు, శమదమాదిగుణాలకు ప్రతినిత్యమూ మనలోపల యుద్ధం జరుగుతోంది. మన మనస్సు దేని యందు లగ్నమౌతుందో అప్పుడు అయితుంది. అందుకే ఆ నరునికి నారాయణుడు చెపుతాడు. ఉభాయసైన్యాల మధ్యన నా రధమును నడుపుము. ఇటు కామక్రోధాదులు పెట్టాడు. శమదమాదిగుణాలు కూడా పెట్టాడు మనకు రెండు. ఉభయ సైన్యముల మధ్య మన రధాన్ని నడిపిస్తున్నాడు ఆ సర్వేశ్వరుడు, ఆ సృష్టికర్త, ఆ పరబ్రహ్మము, ఆ పరమాత్ముడు, ఒక మానవ రూపముతో వచ్చిన మోహనరూపుడు. 

ఏమిచ్చాడు మనిషికి? విచక్షణ జ్ఞానము! మనసు! తప్పు-ఒప్పు అని తెలుసుకునేదానికి అయన మన అంతర్ముఖంగా ఉండి చెప్పి చేయిస్తున్నాడు. ఒక పని చేస్తుంటే తప్పు,తప్పు,తప్పు అని గుండె కొట్టుకుంటుంది.  ఒక చెడ్డ పని చేస్తున్నప్పుడు చెడ్డది చెడ్డది అని తోస్తుంది. ఎవరైనా ఎవరికన్నా ఒక తప్పు గాని మోసం గాని చేసుంటే, ఆ వ్యక్తిని చూస్తానే గుండె కొట్టుకుంటుంది. అయన ఎంత వినయవిధేయతలు వున్నాడు కదా, నాది తప్పు కదా! నాది తప్పు కదా!  ఆ సర్వేశ్వరుడు మన దగ్గర ఉన్నాడని,  ఉభయ సైన్యముల మధ్య ఎట్లా అయితే  ఆయన నడుపుతున్నడో, మోహనరూపుడు. మనకు కామక్రోధాలు పెట్టాడు, మనకు మనస్సు ఇచ్చాడు. దేవతలకు మనస్సు లేదు, రాక్షసులకు లేదు. విచక్షణజ్ఞానం వుంది. తపుఒప్పు తప్పుఒప్పు డెసిషన్ తీసుకునేదానికి, దానిపైన  పట్టుదలతో చేస్తూ చేస్తూ, వస్తే ఆ అటువంటి సద్గురువు మనకి మార్గాన్ని ప్రసాదిస్తారు. తప్పకుండా జ్ఞానాన్నిస్తాడు. మాకు దృఢమైన నమ్మకముంది. అ నమ్మకంతో ఈ రోజు, ఈ ప్రదేశం వచ్చి, అ సద్గురుని సన్నిధికొచ్చాము. మనమందరమూ ఎప్పుడో ఒక స్థలమున వుండినవాళ్ళమే. క్రిందపడి రౌండ్ రౌండ్ రౌండ్ కొట్టుకుని ఇప్పువు మరలా సద్గురుని సన్నిధిలోకి వచ్చి వివిధ రూపాలతో మనమందరము కలుసుకున్నాము.

No comments:

Post a Comment