Experiences 7

స్వామి సన్నిధిలొ జరిగిన ప్రసంగముల నుంచి పదిలపరుచుకొన్న కొన్ని విషయములు ఈ క్రింద కూర్చబడినవి.
=================================================
భగవద్ గీత ప్రవచనం నుండి
ప్రతి జీవికి తండ్రి ఆ పరమాత్ముడు. అన్నింటికి మూలవిరాట్టు ఆ పరబ్రహ్మము ఒక్కడున్నాడు.  ఈ రాక్షస గుణాలకు మనకు సంబంధము లేదుఈ గుణాలు ఆ పరమాత్ముని బిడ్డను రెప్పపాటు మరచిపోతే వాణ్ని తలక్రిందులు చేస్తాయి. రెప్పపాటుకూడా ఏమారకుండా ఉంటే ఆ రాక్షస గుణాలు ఏమీ చేయలేవు.  పండుకొనేటప్పుడు నీకు నచ్చిన (భగవంతుని) పేరు స్మరించు.

ఆ పరబ్రహ్మస్వరూపుడైన పరమాత్ముడు మనలో ఉన్నాడని నిర్ణయించుకొని తనలో ఉన్నవాణ్ణి తాను రోజూ "నిరంతరమూ" కృషి చేసి తెలుసుకొని, ప్రతి ప్రాణిలో అతనియొక్క లక్షణాలు ఉన్నాయని తనలో ఆడే సత్యమే ప్రతి జీవిలో ఉందని అనుభువంలో గ్రహించి నడవాలిఆ పరమాత్ముడు మన హృదయములో ఉన్నాడని భావిస్తూ ఉంటే ఎప్పుడూ మన  దగ్గరే ఉంటాడు


విశ్వరూపము మనలోనే ఉన్నది. విరూపాక్షుడు ఇక్కడే ఉన్నాడునేను అమవాస్యలో ఉన్నాను, పౌర్ణమిలో ఉన్నాను. నేను లేనని భావించవద్దుపురాణ పురుషోత్తముడైన ఆ పరబ్రహ్మము ఈ జగత్తులో ఉన్న అన్ని క్షేత్రాల్లో వెలుగుతాడు. సూర్యనారాయణుడు ఏ విధంగా వున్నడో అట్లా. నేను సర్వకాలసర్వావస్థలయందు నీలో ఉండి నీ యోగక్షేమాలు చూస్తున్నను. ఏ 50 తూర్లో 30 తూర్లో ఇతర చింతనలు కట్టివేసి మనస్సుని ఏకాగ్రము చేశావంటే...అనుకూలమైతుంది

ఏ రూపాన్ని నీవు ప్రేమతో ప్రీతితో ఆరాధిస్తావో ఆ రూపాన్ని దగ్గరపెట్టుకొని నిరంతరము కాలు బొటికినవేలు నుండి కపాలము వరకూ చూస్తూ ఆ స్వరూపాన్ని హృదయములో ప్రతిష్టించుకుంటే మనకు ఆ గుణ గణాలు ఒళ్ళుకు పడతాయి. ఒళ్ళుకి పట్టినప్పుడు నేననే అహంకారము నశిస్తుంది.

ఓరే మానవా!! నువ్వు సర్వకాల సర్వావస్థలయందు నన్ను తలుస్తూ చేశావంటే నీవు ఆఖరి అంశములో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నేను అమలు చేస్తానన్నాడు ఆ పరమాత్మ నీ హృదయము సదా పరమేశ్వరుని ధ్యాసలో ఉంటుంది గాబట్టి నీకు అనుకూలమైతుంది


నీవు చేస్తున్నాననే దురభిప్రాయాన్ని మరచిపోయి, నీవు నా యందు ప్రీతి చేత, నీవే చేస్తున్నానని గానీ, ఎప్పుడూ అనుకోవాకు. నీవు ఎప్పుడూ ఏమీ పని చేయలేవు. నేను ఉండి నీ చేత చేయిస్తున్నాను. నిష్కామ భక్తుడవై, ఎల్లప్పుడూ ఏలాంటి చింతా కోరికలు లేకుండా నాయందు ప్రీతితో, భక్తితో నీ బాధ్యత నిర్వర్తించు.

అతడు నాలో ఉండి చేయిస్తున్నాడు. నేను చేస్తున్నాననే కర్తృత్వ అభిమానము నాకు లేదు, నేను చేస్తున్నా అన్న కర్తృత్వ అభిమానమే నశించినప్పుడు, తన లోపల ఉండి నడిపిస్తున్న సత్యస్వరూపుని గుర్తించటానికి అవకశం కలుగుతుంది. అతడే లేకపోతే ఈ అవయవాలు పని చేయవు అని యదార్ధ స్థితి తెలుసుకొనగలుగుతాం.

జీవుణ్ణి నడిపే వ్యక్తి ఒకడున్నాడు. అతడే పరబ్రహ్మము.  జీవుడు స్వతంత్రుడుకాడు పరతంత్రుడుపరమాత్ముని ఆజ్ఞతో  జీవుడు ఈ శరీరములో మెలుగుతూ ఉంటాడుగుణ రూపము లేనివాడు నాలో ఉండి చేస్తున్నాడుఆ పరబ్రహ్మస్వరూపుడైన పరమాత్ముడు ఈ శరీరానికి అధిపతియై నడిపిస్తునాడు "ఆ పురుషోత్తముడు నాలో ఉండి ఈ పని చేయిస్తున్నాడు" అనే పట్టుదల శ్రద్ధతో ప్రతి పనిలో చేస్తూ నీవు జాగ్రత్తగా నడవటంవల్ల మనకు శ్రేయస్సు కలుగుతుంది.

(జీవిత గమనంలో) ఏ రూపమొచ్చినప్పటికి గూడా నేనున్నానని గుర్తించు. నీకేలాంటి భయము లేదు. భయాన్ని పారద్రోలుకోదేవతలైనా ఒకటే రాక్షసులైనా ఒకటే మానవులైనా ఒకటే. ఎవరిని నొప్పించకుండా చేతనైనంత వరకు సహకరించి  నడచినవాడు త్యాగశీలుడైతాడు. ఎదుటి వాణ్ణి ద్వేషించకుండా కరుణా, ప్రేమ, మైత్రితో నీవు ఉంటూ వస్తే మనస్సు ఏకాగ్రతకొచ్చి స్వస్వరూపాన్ని చూచేదానికి అనుకూలమౌతుంది.

ఓంకారముతో పుట్టిన మన  శరీరములో ఓంకార లక్షణాలు.. (ధృడ పడతాయి). ఈ శరీరము నశించినప్పుడు ఎమైతుంది మనకు? తిరిగి మళ్ళా జన్మ వస్తుంది అంతేగదా!! నీకు చావులేదురా .... ఆత్మవు.  ఆకలి చేత కొట్టుకులాడుతున్నావు.

ఈ క్షేత్రాన్ని నడిపే పుణ్యపురుషుడు ఎవడున్నాడో అతని యొక్క నిజస్థితిని తెలుసుకొని ఆ అహంకారాన్ని పెట్టుకున్నామంటే అహం బ్రహ్మోస్మి. నేనే పరమాత్ముణ్ణి గుండెలమీద చెయ్యెట్టి చాటుతాడు. నిజమైన అహంకారం కావాలి. ఈ ప్రకృతి స్వరూపమైన అహంకారం పెట్టుకుంటే నశిస్తాడు.

చావులేదు నీకు. నీకు చావు లేదు. శరీర భ్రాంతిలో ఉండి మ్రగ్గి ఛస్తాను ఛస్తాను అంటున్న భ్రాంతినివదలవయ్యా, నీకు నేను కానస్తాను అని కృష్ణ పరమాత్ముడు మొర పెట్టుకుంటాడు.

ఆ కృష్ణ పరమాత్ముడు ఈ హృదయములో ఆత్మ స్వరూపముగా ఉండి మన పనులన్నీ నెరవేరుస్తాడు 
=================================================

About Astrology (Around 2010):

Swami told that for match making Tara Balam of 2,4,6,8,9 are auspicious.

Note: తరా బలాలు

1 - జన్మతార      2 - సంపత్తార       3 - విపత్ తార        4 - క్షేమ తార        5 - ప్రత్యక్ తార
6 - సాధన తార   7 - నైధన తార      8 - మిత్ర తార         9 - పరమ మిత్ర తార

On a different occasion he told "శ్రవణాయే ధనిష్ట ". Later I read in physics about how sometimes same star is seen as different star due to Einstein's general theory of relativity's gravitational lensing concept.

=================================================

19-12-2010: రోజు మందిరంలొ జరిగిన స్వామి ప్రసంగంలొ కొన్ని విషయలు:
  • "జీవుడు పరమాత్మ కాలేడు నాయనా. కాలి బొటనవేలి నుంచి కపాలం దాకా ఆడే జీవుడవు నీవు"
  • "బ్రహ్మ(నాభి స్థానంలొ చూపారు), విష్ణువు (హృదయము), శివుడు/ఈశ్వరుడు (భృకుటి), జీవుడు పైన ఉంటాడు, ఆపైన గురుచరణాలు/సహస్రారము"
  • పోతులూరి వీరబ్రహ్మెంద్ర స్వామి వారి చరిత్రలో కక్కయ్య వృత్తాంతము చెప్పారు.

20-12-2010: రోజు మందిరంలొ జరిగిన స్వామి ప్రసంగంలొ కొన్ని విషయలు:
  • "పాలు అమృతము అనుకుంటే అమృతము, విషము అనుకుంటే విషము"
  • "90 కోట్లు కావాలంటావు, ఏమీ లేకుండా లోను ఎలా ఇస్తారు?"

21-12-2010: రోజు మందిరంలొ జరిగిన స్వామి ప్రసంగంలొ కొన్ని విషయలు:
  • "శాంతము, విచారణ, తృప్తి, సత్సావాసము "
  • "జ్ఞాని కావాలంటే సాక్ష్యము ఉండాలి"
  • "రోజూ తోమకపోతే రాగిచెంబు చిలుముపడుతుందని శ్రీరామకృష్ణపరమహంస అన్నారు"
  • "నీ తలలో బావుంటే అంతా బావుంటుంది "
========================================================================

ఒకసారి ధ్యానము చేసి స్వామివారితో చెప్పాను. "చెప్పినట్లు చేస్తే ఎంతో ఎత్తు ఎదుగుతావు. లేకుంటే నీ లోకములో నువ్వు ఉంటావు" అన్నారు.

ఒకసారి వేదగణితము అధ్యయనము చెయ్యలని ఉందని చెప్పాను. స్వామి కోపముగా "ఆ పుస్తకాలు చదివి చెయ్యి. మమ్మల్ని అడగద్దు" అన్నారు.

ఒకసారి ఇలా చెప్పారు:

  • "ఇల్లు అంటే శరీరము, కొంప కాదు
  • "ఆలోచన శత్రువు"
  • "సద్గురువులు 4 రకాలు. మొదటి రకము వారు హిమాలయాల్లో ఉంటారు. ఎప్పుడూ బయటకు రారు. "

========================================================================
"గురువే చిల్లగింజ "

"భగవంతుడు మనిషిని మట్టితో చేసాక, అగ్నిలో పుట్టిన వాళ్ళను మనిషికి నమస్కరించమనాడు.'ఆ మేము అగ్నిలో పుట్టము, మేమా నమస్కరించేది ' అన్నారు. 'రేయ్, కాల్చేస్తా' అన్నాడు భగవంతుడు. అప్పుడు వాళ్ళు 'సరే, అయితే మనిషి నినూ రెప్పపాటు కాలాము మరిచినా తలక్రిందులు చేస్తాముఅన్నారు. 'నా బిడ్డ నన్ను మరుస్తాడా' అన్నాడు భగవంతుడు. ధనము పెట్టాడు. అంతే....(మనిషి జారిపొవటానికి/ఎమారటానికి)"
  • "కాలింగ్ బెల్. ఎప్పుడూ ఆడుతుండాలి" అన్నారు నాలికను వ్రేలితో చూపుతూ.
  • "దర్బార్ అంటే హృదయము"
  • సద్గురుదేవా అనండి రాకపోతే రాళ్ళెత్తి కొట్టండి
  • "తినేటప్పుడు కొంత బయట అర్పిస్తున్నావా" అని ఒకసారి అడిగారు
  • "నోట్లో ఆడుతుండాలి, ముళ్ళు పోతాయి" అన్నారు మందిరములో.
  • పూజ సింపుల్ గా చేసుకో
  • బాబా మొదట కులదైవాన్ని పూజించండి అన్నారు” - 
     Note: స్వామి దెగ్గరకు సమస్యలతొ వచ్చేవారికి, స్వామి ఎప్పుడు వారి కులదైవమును పూజించండి అని           చెపుతారు.
=================================================
కులాల ప్రస్తావనలొ:  స్వామివారు "కులాలు లేవు" అన్నారు. అయితే నాతో మీరు బ్రాహ్మణులు అంటూ కొన్నిసార్లు అన్నారుమాష్టరు గారు కూడా కులాల్ని పట్టించుకోలేదన్నది తెలిసిన విషయమే

నారద భక్తి సూత్రాలలో మహాత్ముల గురించి చెబుతూ కులాలని పాటించరు, అందరూ సమానమే వారికి అని చెబుతారు. నాకు ఆశ్చర్యపోయేంతగా అనిపించినది స్వామివారు చూపే సమానత్వమే.  పైకి కోపముగా అరిచినట్లు కనబడినా, ఎంతో ప్రేమ చూపుతారు వచ్చే వారందరిపైనా. ఇది తెలిసిన విషయమే. అయితే అది ఎప్పుడూ తరచుగా వచ్చేవారే కాదు, అందరూ సమానమే. ఎలాంటివారయినా వారికి సమానమే
=================================================
లడ్డూలు చేసేప్పుడు దర్గాలో ఒకరు చెప్పారు, స్వామి వారు ఇలా చెప్పారని: "సద్గురుదేవా" "సద్గురుదేవా" అంటూ చెయ్యండి. తినేవారికి బలము, తేజము వస్తాయి.
=================================================
బెండకాయలు నానపెట్టి, మర్నాడు ఆ నీళ్ళు త్రాగితే షుగరు వ్యాధి తగ్గుతుంది.  జ్వరములో  కషాయము తాగితే తగ్గుతుందికాళ్ళ నొప్పులు తగ్గడానికి కాళ్ళు (మామూలు) నీళ్ళలో పెట్టుకుని కూర్చోవాలి.

వేడి, మూత్రములో మంట -- రోజూ ఆఫీసుకి వెళ్ళేముందర కొబ్బరిబోండము త్రాగాలి + 4 గంటలకి ఒకసారి ఏదైనా తినాలి (మిషను చేయలంటే ఆయిలు కావాలి అన్నారు)

ఒకసారి దర్గాలోని మహాత్ములు ఎలా ఎంతోమందికి వ్యాధులు తగ్గించారో చెప్పారు. నాతో విషము అయినా తిను, ఇక్కడకొచ్చి దణ్ణాము పెట్టుకుటే ఏమీ కాదు అన్నారు. ఎలా నమస్కరించాలో చెప్పారు. పడమరనుంచి తూర్పు వైపు , దక్షిణము నుంచి ఉత్తరము వైపు తిరిగి అలా చెప్పారు.
=================================================
ఒకసారి స్వామి అన్నారు "సాయిబాబాలాగా ఉండాలంటావు. వారి పుట్టుక వేరు నాయనా."
=================================================

No comments:

Post a Comment