Gita Discourse 2


ఆ తత్ లక్షణాలు మన ఒళ్ళులో ఎప్పుడైతే పడుతుందో మనకు భయము ఉండదు భీతి ఉండదు ధైర్య సాహసాలన్నీ ఏర్పడతాయి. అప్పుడు తాను ఇంకా నేను ఏ పని చేస్తే బాగుంటుందని కృష్ణుని ప్రేరేపణతో చేస్తాడు. త్వం అని ఏ పక్షములో ఆ భగవంతుడు ఏ ఏ రూపాలతో ఈ ప్రపంచములో వెలుగుతున్నాడు అన్నది త్వం అన్నదాన్ని చెప్తాడు. ఎప్పుడైతే ఆత్మ సమ్యోగాన్ని ఒళ్ళులో పూర్తిగా ఇమిడిందా నీవు జ్ఞాన పురుషుడవు నీవు నేను చెప్పినది అర్ధమైతుంది. వీడు స్థితచిత్తుడై ఉన్నాడని ఆ కృష్ణపరమాత్ముడు అతను వేసిన ప్రశ్నలకు సరిగా జవాబు చెప్తాడు.  నీవు ఎన్ని పనులు చేసినా ఎన్ని కర్తవ్యాలు నడిచినప్పటికీ గూడాఅ నీవు ఏ ఏ ధ్యానము చేయకున్నా నువ్వు చేసే పనులన్నీ సర్వము నాకంకితము చేసేయి. నేను నిన్ను నడిపిస్తున్నానని దృఢ చిత్తుడవై నీవు చేస్తున్నాననే దురభిప్రాయాన్ని మరచిపోయి నీవు నా యందు ప్రీతి చేత నీవే చేస్తున్నానాని గానీ ఎప్పుడూ అనుకోవాకు. నీవు ఎపుడూ ఏమీ పని చేయలేవు. నేను ఉండి నీ చేత చేయిస్తున్నాను. నిష్కామ భక్తుడవై ఎల్లప్పుడూ ఏలాంటి చింత కోరికలు లేకుండా నాయందు ప్రీతితో భక్తితో నీవు నన్ను పొందాలంటే రాజవిద్యా రాజ గుహ్యములో చెప్పిందాన్ని నువ్వు నడుస్తూ  సర్వకాల సర్వావస్థలయందు నన్ను తలుస్తూ ((జాగ్రత్, స్వప్న, సుషుప్త (అవస్థాత్రయము)), తురీయ, తురీయాతీత) ఈ హృదయ మధ్యములో ఉన్నది ఆ సర్వేశ్వరుడు మనలను ఆడిస్తున్నాడు తోలుబొమ్మలుగా చేసి ఇతదున్నడని ఎప్పుడైతే విశ్వరూప రీత్యా నేర్చుకొని తెలుసుకొని జ్ఞానాన్ని చూసామో అతడు ఎవరైతే దాన్ని గమనిస్తారో తాను చేస్తున్నాడు అనే కర్తృత్వ అభిమానానము లేకుండా ఏ మానవుడైతే ఆచరణ చేస్తూ ఆయనకంకితము చేస్తాడొ అతనికి ఆ రమ్యమైన స్థానాన్ని చూపిస్తాడు

నీ నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటాడు. నోరంటె నువ్వు పలుకుతున్నది స్వచ్చముగా ఉంటే నువ్వు సరైన పధ్ధతిలో ఆచరిస్తూ వస్తే అన్నీ నీకనుకూలంగా ఉంటుంది అని చెప్పాడు. సర్వజీవులకు దేవతలకు ఋషులకు మనుష్యులకు నాలుగు పాదాలతో ఉండే జంతువులకు అన్నిటికీ గూడా వీర్యాన్ని తేజస్స్ను బలాన్ని ఇచ్చే ఆ పరబ్రహ్మము ఒక్కడున్నాడు. మూలవిరాట్టు ఒక్కడున్నాడు. మనకు మనస్సు ఉంది గాదా తప్పుఒప్పు అని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించినాడు. సమస్త జీవుల్లో నీవే ఉండేది అని అర్ధము చేసుకొని……. తన వీర్యము బలము తేజస్సుతో ప్రతి ప్రాణినీ తాను రక్షించి కాపాడుతునాడు. నన్ను గుర్తించాలంటే ప్రతి ప్రాణిలో నేనున్నాను. ద్వేషమన్నది లేదు. దేవతలైనా ఒక్కటే మానవులైనా ఒక్కటే రాక్షసులైనా ఒక్కటే.  మగతాయి త్రాగేవాడూ వాడే సారాయి త్రాగేవాడూ వాడే వ్యభిచారీ వాడే. అన్నిట్లో  నేనే ప్రేరేపణ చేస్తున్నాను అంటాడు. దాన్ని సక్రమంగా మనమర్ధము చేసుకొని నడిచినామంటే ..ఎప్పుడు ఏ మావి కట్టాలో ఎప్పుడు ఏ లక్ష్యం ఇవ్వాలో అతడు ఇస్తాడు అనే దృఢ చిత్తుడవై.. (ధృతరాష్టృడు  భీముని చంప ప్రయత్నించిన సందర్భము) మానవుడు తన నిజ స్థితిని తెలియక ఎదుటి వాడ్ని ద్వేషించి వాడ్ని చంపాలని కుట్రపన్ని ..

విశ్వరూపము మనలోనే ఉంది. విరూపాక్షుడు ఇక్కడే ఉన్నాడు. విరూపాక్షుడు ఇక్కడే ఉన్నాడు. విశ్వరూపుడు ఇక్కడే ఉన్నాడు. ఆ రక్షకుడు మనకు సదా చూపిస్తాడు. జ్ఞానములో పూర్తిగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ మాయ కూడా నిన్ను ఆవరించుకున్నది పోతుంది. మాయని విడదీస్తానని ఎప్పుడూ అనొద్దు. మాయ నానుంచి పుట్టినదే. నేను మాయకు ఆధారము. రోజూ అన్ని పనులూ చేయి అతడు నాలో ఉండి చేస్తున్నాడు. నేను చేసిన పనులన్నీ కర్తృత్వ అభిమానము నాకు లేదు. అతడే చేయించాడు. అతడు చేయిస్తున్నాడన్నప్పుడు తప్పు పనులు నువ్వు ఎట్టా చేస్తావు? అతనికి అంకితము అయినపుడు నువ్వు తప్పు పని...లేదు. సరైన మార్గములో నడిచి సత్యస్వరూపాన్ని తెలుసుకొని నిన్ను నీవు రక్షించుకొనడానికి ప్రతీ ప్రాణిని రక్షించడానికి. భగవంతుడు ఎంతకాలము నిర్ణయించాడో అంత కాలము ఈ ప్రపంచములో ఉండి ధైర్యమిస్తాడు, విద్యనూ ఇస్తాడు, నీక్కావల్సిన డబ్బు హంగులన్నీ ఇస్తాడు. అందరికొరకై ఇచ్చాడే గానీ నీ జానెడు పొట్టకొరకు ఇవ్వలేదు. అందరూ నీవే అన్నందువల్ల నీకేది కావాలో అది అందుబాటులోకి….అందుబాటులోది పదిమందికి పంచి నువ్వు ఆనందంగా ఆయన స్వరూపాన్ని పరతి ప్రాణిలో ప్రతి జీవిలో చూస్తూ వచ్చావా..(సత్యభామతో రుక్మిణి) ఇక్కడే ఉన్నాడమ్మా కృష్ణ పరమాత్మా. కరుణా ప్రేమ నీలో ఉంటే నీ హృదయములో ఉన్నాడని భావిస్తే ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నాడు కదమ్మ. నీ కన్ను చూపు అర్ధము లేని వస్తువులని కోరకుండా.

నువ్వు ఏకాగ్రతగా నీ చూపు నిలకడ చేశావా నీలో ఆడుతున్న ప్రాణము హద్దులు మీరకుండా ఉంటుంది. ప్రాణమంటే హద్దులు మీరకుండా ఎప్పుడు ఉంటుందో..బీ యిన్ ద లిమిట్స్. బౌండరీ. బౌండరీ ఎప్పుడు దాటకుండా ఉంటుందో నీకు ఇతర ప్రాణిని నొప్పించేది ఉండదు. కరుణా ప్రేమా ఉట్టిపడుతుంది.
సాంఖ్య యోగ రూపముగా నీకు చావు లేదురా. ఆత్మవు. చావు లేదు. స్థితప్రజ్ఞుడవు  అని జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇది నేను చెరువులో వచ్చిన నీళ్ళు చల్లినట్లు చల్లుతా ఉన్న పరమాత్ముడి.. ఎవరికోసము చల్లావు? ఆ పరమాత్ముడు అందరిలో ఉన్నాడని వినియోగించినదానివల్ల నీకది ఇస్తున్నారు. "అదే హ్రీం"
"హ్రీం"  "హ్రీం అంటే లక్ష్మి" లక్ష్మంటే ఇనప్పేట్లో పేట్టినది తీసినది (కాదు). అదే కృష్ణ పరమాత్మ. హ్రీం అన్నాడు. హ్రీం అంటే ధైర్యము సాహసము. అదే విభూది యోగములో చెప్పాడు. ఐం అన్నాడు.
విద్య. విద్య వీడికి నేర్పినాడు.


కర్తృత్వ అభిమానాన్ని త్రోసిపుచ్చాడు. సత్య స్వరూపాన్ని చూపించాడు. అప్పుడు నిజ స్థితిని పొందే దానికి మార్గాన్ని చూపాడు. ఆ మార్గం పొందింతర్వాత ఆ భక్తితో మనము ఎన్ని బిల్డింగులైనా కట్టవచ్చు. పునాది గట్టిగా ఉంటే పైన మిద్దెలు కట్టచ్చు కదా. బాలుడు కాదు బాల (సందర్భము: కృష్ణపరమాత్మ బాలగా)  ఇతర ప్రాణికి సహకరించి తోడ్పడేటట్టు నీడగా ఉండండి.  ఓమ్ ఓమ్కారము ఆయనే హ్రీంకారము ఆయనే ఐం ఆయనే హ్రీం ఆయనే క్లీం/ఐం ఆయనే.  "ఐం అంటే విద్య".  మనకు సర్వ విద్యలు ప్రసాదించినది ఆ పరమాత్మ. "దాన్ని ఐం అంటారు". "హ్రీం - ధైర్య సాహసాల్నిచ్చాడు"
"తేజోస్వరూపమైన కాంతినిచ్చాడు" "ఐశ్వర్యము ఆయన నుంచీ పుట్టినవి గానీ మనకు స్వంతముగా మనము (చెయ్యలేదు?)". దేవతలు, ఋషులు, మానవులు, నాలుగు కాళ్ళ జంతువులూ గూడా ఆయన యొక్క వీర్య తేజో రూపముతో ప్రపంచాన్ని.. "ఓరే మానవా, నువ్వు సర్వకాల సర్వావస్థలయందు నన్ను తలుస్తూ చేశావంటే నీవు ఆఖరి అంశములో ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను నేను అమలు చేస్తానన్నాడు ఆ పరమాత్మ."

నేను సర్వజీవులను బిడ్డలుగా చూస్తాను. సర్వ జీవులకు నేను తల్లిగా ఉఇండి చూస్తాను. సర్వ జీవులను నేను పోషిస్తాను. సర్వ జీవులను నేను రక్షిస్తాను. ఎవరు ఏది కోరితే అది నేనిస్తానని ఆయన పదకొండు వాక్యాలతో నిఋణయము చేసి ఆ పరబ్రహ్మను ఆ పరమాత్ముని అడిగితే .. ఆ మహనీయుడే షిర్డీ నివాసములో చిరస్థాయిగా నిలబడ్డాడు. అక్కడ నిలబడినాడని మనమక్కడ పోవాల్సిన అవసరము లేదు. పోకూడదని కాదు. పోవాల. మన మనస్సుకు ఏకాగ్రత కావాలంటే వారు తపస్సు చేసిన స్థలములోకి పోతే మనకు పిల్ల వాయువు తగిలినట్లు అది తగిలినప్పుడు మనస్సు ఏకాగ్రమౌతుంది. ఆయన ఇక్కడే మనముందరే ఉండి మన అందరినీ నడిపిస్తూ చేస్తూ ..సాయినాధుడు. ఆ సత్య స్వరూపమైన సాయినాధుడు. అంటే ఏమి ఈ శరీరాన్ని నడిపే సత్యమే నేను అని గ్రహిస్తే, మనకు తొదు నీదగా ఆయన ఎల్లప్పుదూ ఉంది మన యోగక్షేమాలు ..బొంబాయి నుంచి ఈ ఇద్దరూ రైల్లో వచ్చారు చూసారా వారి దగ్గర నేను సేవ చేస్తున్నాను ఎల్లప్పుడూ వారి దగ్గరే ఉన్నాను వారు పిలుస్తా ఉండారు వారిచ్చే లంచము వారిచ్చే పదార్ధాలకు నేను ముగ్ధుడనై వారి సేవ చేస్తున్నాను. కానీ రూపాన్ని చూడాలని పరిగెత్తారు.



నేను చేస్తున్నా అన్న కర్తృత్వ అభిమానమే నశించినప్పుడు అతడు నిరంతరము మనలొ సత్య స్వరూపుడై ఆ కృష్ణపరమాత్మ ఆ సాయినాధుడే ఆయనే మురళీధరుడు. అట్లే  మనము త్యాగశీలత చిత్తము ఏకాగ్రత చేసికొని పొయే గుణాలు మనలో ఏర్పడతాయి అప్పుడు రామావతార లక్ష్యము.. కృష్ణుణ్ని చూడాలంటె తృష్ణ పోవాలి. తృష్ణ అంటే ఆశ ఆశ ఆశ ఏమాశ? వెంటరాని వస్తువులు కోరుతున్నావే ఆ దాని యందు ప్రీతి కొంత తగ్గుతే.. భక్త జన సమ్రక్షణార్ధము  యే ప ని నై నా చేయుటకు (సిద్దముగా ఉన్నాడు). ఆ పరంధాముడు ఆ పరమేశ్వరుడు ఆ కృష్ణ భగవానుడు మనము ఎప్పుడైతే పిలుస్తామో నీవు యే రూపము ఎందు ప్రీతి ఉన్నా యే పేరు యందు ప్రీతి ఉన్నా ఆ పేరుతోనే అతనే వచ్చి చేస్తాడు. అతను ఎల్లప్పుడు మహాదేవా మహాదేవా మహాదేవా అన్నాడు. "మహాదేవా మహాదేవా అని కృష్ణపరమాత్మ పరిగెత్తతా ఉంటే కైలాసముఖమునుంచీ వస్తాడు. వానికి ఏ ఇబ్బందులూ లేకుండా పరమేశ్వరుడు మన లోపల ఆడిస్తునాడు చూడు అతడు మన వె ను వెం ట ఉంటాడు. ఆ కృష్ణుని యొక్క భావన మన హృదయములో పెట్టుకొని ఎవరైతే ధ్యానము చేస్తారో వారికి ఏలాంటి ఇబ్బందులూ లేకుండా వారికి కావల్సినవన్నీ అందుబాటు చేసేదానికి కైలాసము నుండి పరమేశ్వరుడు పరిగెడతాడు.


కైలాసము ఎక్కడుందో మనకేమి తెలుసు? మన కపాలములో ఉన్నాడే కృష్ణ పెరుమాళువు కూర్చున్నాడే ఆ సద్గురుమూర్తి సాయినాధుడు అతడు మనకు వెంట వెంటనే ఉండి అన్నీ చూపిస్తూ నడిపిస్తూ చేస్తాడు. తన లోపల ఉండి నడిపిస్తున్న సత్య స్వరూపుడు లేకపోతే ఈ అవయవాలు పని చేయవు అని యదార్ధ స్థితిని తెలుసుకొన్నప్పుడు అహంకారము తొలగిపోతుంది. అసి - ఈజీవుడు బ్రహ్మ స్థానానికి పొందేదానికి - అసి అని యోగాన్ని (చెప్పాడు?) దాన్నే తాత్వమసి లక్ష్యము అని ..ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి. తత్వమసి తత్వమసి - ఆ లక్ష్యాన్ని ప్రసాదించి కృష్ణపరమాత్ముడు మానవుణ్ణి (నడిపిస్తాడు?)..కానీ మనము అంధకార కూపములో పడి ఈ భూమిలో దొరికే వస్తువంతా నాదే అని (...?) యదార్ధ స్థితిని తెలుసుకోలేక పోతున్నాము. కాబట్టి ఈ ఇంటిలో ప్రవేశించిన ప్రతి ఒక్కవాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతీ ఒక్కరూ ఒక్క రెప్పపాటైనా మై మరచకుండా అఖరికి కనీసము అన్ని పనులూ చేసి పవళించేటప్పుడైనా పండుకుటప్పుడు నీకు నచ్చిన పేరు. "కృష్ణుడెక్కడ దొరుకుతాడు? వాక్ మౌనము వాక్ మౌనమూ"

No comments:

Post a Comment