Siddha Mangala Stotram



దర్గా అంటే ఒక బ్రహ్మవేత్త అయిన మహమ్మదీయ సాధు/సంతు పురుషుని సమాధి. సూఫీ సంప్రదాయంలో  ఒక సాధకుడు పరమాత్మలో లీనమైననాడు పొందే సంయోగంలోని  అనుభూతికి సృష్టిలో సమమయిన అనుభవం /అనుభూతి/ ఆనందం మరొకటి లేదు. ఇది మా గురువుగారు అవికల్ప సమాధిలో రూపం విడిచిపొయ్యారే అని దుఃఖపడే సందర్భం కాదు. అటువంటి స్థితిని పొందిననాడు సాధకునికి / గురువుగారికి పండుగ. మానవాళికి పండుగ. మానవ జీవితంలో సర్వోత్క్రుష్టమైన క్షణం ఉత్సవం చేసుకునే సందర్భంనిర్వికల్ప సమాధిలో ప్రాణోత్క్రమణ చెందిన మహానుభావుని శరీరాన్ని సమాధి చేసి, దానికి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం మహాత్ముడు సమాధి చెందిన రోజున  ఆరాధన చేసే ఉత్సవాన్ని ఉరుసు అని అంటారు. దీనిని రెండు రోజులు చేస్తారు. మొదటి రోజు వారికి  గంధం సమర్పిస్తారు. రెండవరోజు జెండా ఎగురవేసి నైవేద్యం సమర్పిస్తారు. రకంగా  అవికల్ప సమాధిలో వున్నమహానుభావుని  ద్వారా సామాన్య ప్రజానీకం సృష్టికర్తకు తమ ప్రార్థన తెలియచేయటం సత్ సంప్రదాయం.

ఇటువంటి పద్ధతిని మనము హిందూ సనాతన సంప్రదాయంలో, క్రైస్తవ సంప్రదాయంలో కూడా చూడవచ్చు. శృంగేరి పీఠంలో కూడా పరంపరలోని గురువుల సమాధులని శ్రద్ధతో పూజిస్తారు. శైవ సంప్రదాయంలో సమాధి మందిరాన్ని అధిష్టానం అంటారు. సమాధి మీద శివలింగాన్ని ప్రతిష్టిస్తారువైష్ణవ సంప్రదాయంలో బృందావనం అంటారు. సమాధి మీద తులసి మొక్కని ప్రతిష్ట చేస్తారు. ఇదే విషయాన్నీ మనము రోమ్లోని సిస్టీన్ చ్ఛాప్పెల్ లో కూడా  క్రైస్తవ పోపుల సమాధుల్ని శ్రద్ధగా పరిరక్షించటం గమనించవచ్చు. ఇది అన్ని మతముల వారు, అన్ని సంప్రదాయాల వారు అత్యంత శ్రద్దా భక్తులతో ఆచరించటం మనము చూడవచ్చు.

మానవ జీవన లక్ష్యమైన ఆత్మానుభవాన్ని పొందిన జీవుడు పూర్ణత్వాన్ని చెందుతాడు. అటువంటి మహానుభావుడు సృష్టికర్తతో  సమమైతాడు. దానికి శాస్త్ర వచనమే ప్రమాణం "బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి". ఇందువల్ల మనము మతస్థులమైన, సంప్రదాయానికి చెందిన వారమైన ఒక బ్రహ్మవేత్త సమాధి మందిరాన్ని దర్శించి ఆయన పట్ల మన శ్రద్దని, గౌరవాన్ని కనపరచటంలో సంకోచపడక్కర్లేదు.

స్వామి ఎన్నో మార్లు "ఇది సద్గురు పీఠం నాయనా" అని చెప్పేవారు. సనాతన సంప్రదాయంలో సాధారణంగా 'సద్గురు' అనే పదం దత్తాత్రయునికి సంకేతం, అయన పరంపరకు సూచన. ఇందులో ఒక ప్రశ్న వస్తుంది. సమాధి లో వున్న వారేమో మహమ్మదీయులు, దీనిని సద్గురు పీఠం అని అర్థం చేసుకోవటంలో ఎట్లా సమన్వయము చేసుకోవాలిదీనికి స్వామే సమాధానం చెప్తారు. 2012 నుంచి ఆశ్రమంలో సిద్ధ మంగళ స్తోత్ర పారాయణ చేసిన తరువాత స్వామి రెండు నిముషాలు చెప్పినది మనము జాగ్రత్తగా గమనిస్తే, ప్రశ్న సమాధానపడుతుంది.

"రూప నామ క్రియలు లేని పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడు, పరమాత్ముడు, దేవదేవుడు, కృపాళుడు, భక్తవస్త్సలుడు, సర్వజీవులను పోషించి, రక్షించి, కాపాడే, అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అది మధ్యములు లేనివాడు, సర్వాంతర్యామి, సర్వసాక్షి, పరంధాముడు, పరాకాశుడు, పరబ్రహ్మ స్వరూపుడు పిఠాపురంలో మూడు రూపాలతో వెలసినాడు. శ్రీపాద శ్రీ వల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కల్కోట మహారాజ్. మూడు దత్తాత్రేయుని నిజస్వరూపములు. అయన(దత్తత్రేయుడు) ఉత్తరదేశం నుంచి  బయలుదేరి దక్షిణానికి వచ్చి, 'సర్వం ఖిల్విదం బ్రహ్మ' ఒకే కులం, ఒక జాతి, ఒకే మతం అని సర్వులకు హితోపదేశం చేయుటకై వచ్చి ఎనుబది లక్షల జీవరాసుల్ని తన కడుపులో పెట్టుకొని ప్రశాంతంగా తపఃసంపన్నుడై కూర్చున్న కాలంలో.....
సత్య స్వరూపుడు, సద్గురుడు హజరత్ దర్బార్ అలీషా వలి రహమతుల్లా అలైబాబా ఉత్తరదేశం నుంచి వచ్చి ఆయనని ఆశ్రయించి జ్ఞానభిక్ష తీసుకొని ఆయన ఉత్తరువుతో  బ్రాహ్మణ అగ్రహారమైన స్థలంలో సర్వజీవుల్ని సమదృష్టితో చూస్తూ పరిపాలిస్తూ  కాలంలో .....

ఎవరైనా అయన దగ్గర  శిష్యరికం చేసిన వారు కూడా తనలోని సత్యం ప్రతిజీవిలో ఉందని గుర్తెరుగునట్టు చేసిన సత్యస్వరూపుడు, పరంధాముడు, పరాకాశుడు, పరబ్రహ్మ స్వరూపుడు, పరమేశ్వరుడు సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలి రహమతుల్లా అలైబాబా వారిని మా హృదయంలో ధ్యానించి సర్వజీవులను సమదృష్టితో కాపాడవలసిందని పాదములని పట్టి బ్రతిమాలుకుని వేడుకుంటున్నాను"

No comments:

Post a Comment