హైద్రాబాదు
నుండి రాజీవ్ అనే స్వామి భక్తుడు
1995 నుండి దర్గాను దర్శిస్తున్నాడు. 2003 తరువాత, స్వామి ఆజ్ఞతో వచ్చినప్పుడల్లా దర్గాలో కనీసం ఒక రాత్రి
నిద్దుర చెయ్యసాగినాడు. స్వామి ఇతనికి దర్గాకి వచ్చినప్పుడు రిటర్న్ రిజర్వేషన్ చేసుకోవద్దని చెప్పినారు. అప్పటినుండి ఇప్పటిదాకా, గత 14-15 సంవత్సరాలుగా దర్గా నుండి హైద్రాబాదుకు
వెళ్లే ప్రతి తిరుగు ప్రయాణం
ఒక అనుభవం, ఒక జ్ఞాపకం. సద్గురువు
తోడునీడగ వెన్నంటి ఉండి కాపాడుతున్నాడని
ఆశ్వాసన.
నీలకంఠరావుపేట
కడప నుంచి 29వ కిలోమీటరు వద్ద
వస్తుంది. కడప నుంచి రాయచోటి
వెళ్లే హైవేలో రామాపురం మండలం ఆర్టీసీ
వారికీ ముఖ్యమైన స్టాపు. ఎక్సప్రెస్ లేక నాన్-స్టాప్
బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయి.
మరి ఇంకెక్కడా ఆగవు. మార్గంలో గువ్వలచెరువు
సమీపంలో ఒక ఐదు కిలోమీటర్ల
ఘాట్ రోడ్ వస్తుంది. సామాన్యంగా
చాల సందర్భాల్లో ఈ ఘాట్ రోడ్డులో
పెద్ద వాహనాలు (గూడ్స్ లారీలు, బస్సులు) ఫెయిల్ అవ్వటమో, ఆక్సిడెంట్ అవ్వటమో జరుగుతుంది. మొదట్లో చాలామంది భక్తులు నీలకంఠరావుపేట బస్టాపులో దిగి రెండు-మూడు
కిలోమీటర్ల దూరం నడచుకుంటూ దర్గా
చేరేవారు. తరువాత కాలంలో ఆటో రవాణా పెరిగి,
రామాపురం బస్టాండ్లో దిగి ఆటో చేసుకొని
దర్గా వెళ్ళటం ప్రారంభమైంది. మాములుగా తిరుగు ప్రయాణంలో దర్గనుండి రామాపురానికి ఆటో మాట్లాడుకుని, రామాపురం
బస్టాండ్లో బస్సుఎక్కి కడపకు వెళతారు. రాత్రి
8:00 PM తరువాత రామాపురం బస్టాండ్లో నిర్మానుష్యంగా ఉంటుంది. లైట్లు కూడా తక్కువగా ఉంటాయి.
బస్సు ఎక్కేక ప్రయాణం యాభై నిముషాలనుంచి గంట
పడుతుంది. మార్గంలో కడప టౌన్ సమీపంలో,
ఒక రైల్వేగేటు వుంది. ఎప్పుడన్నా ఈ గేటు పడితే
మరికొంత సమయం పడుతుంది. కడప
చేరిన తరువాత సెవెన్రోడ్డు సర్కిల్స్లో వున్నా ట్రావెల్స్ వాళ్ళని సంప్రదించి టిక్కెటు బుక్ చేసుకంటే తరువాతి
ప్రయాణం.
సామాన్యంగా
స్వామి సాయంకాలం ఆరతి చూసుకుని భోంచేసి
వెళ్ళమని చెప్పేవారు. ఎప్పుడు స్వామి ఏమి చెప్పిన అయన
మాట జవదాటకుండా నడుచుకునేట్టు ప్రయత్నం చేసేవాళ్ళము. కాలానుగుణంగా
సాయం ఆరతి 7:40 PM - 8:15 PM సమయంలో పూర్తి అయ్యేది. అక్కడినుండి
రామాపురానికి ఒక 20-30 నిముషాలు పడుతుంది. అక్కడ టైముకి బస్సు
దొరికితే 9:45 PMకి ఒక పది
నిముషాలు అటుఇటుగ కడప చేరగలము. చాల
సంవత్సరాలు రాత్రి 10:30 PM తరువాత బస్సు దొరకటం కష్టంగా
ఉండేది. ఇది ఇంత వివరంగా
చెప్పటం ఎందుకంటే మొత్తం మీద ఒక అరగంట
సమయంలో కడపనుంచి హైద్రాబాద్కు టిక్కెటు సంపాయించి బస్సు ఎక్కేదాక కొంత
ఉద్వేగంగా ఉంటుంది. ఈ బస్సులో టికెట్
ఉంటుందో లేదో, దొరుకుతుందో లేదో.
గురుచరణాల మీద ఎంత విశ్వాసం
వున్నా, బస్సు ఎక్కేదాకా ఆచరణలోకి
వచ్చేటప్పటికి కొంత ఆరాటం, టెన్షను,
ఉద్వేగము ఉంటాయి. తరువాతి రోజు ఉద్యోగభాద్యతలకి వెళ్ళాలి.
అటువంటి
కొన్ని తిరుగుప్రయాణ అనుభవాలు కొన్ని ఈ కింద పొందుపరచడమైనది.
ఒకసారి
ఆరతి పూర్తి చేసుకుని, భోంచేసి ఆటో ఎక్కి, రామాపురం
బస్టాండ్ చేరేసరికి ...ఆ రోజు కడపకు
వెళ్లే బస్సులు, లారీలు బందు అని తెలిసింది.
ఈ సందర్భంలో మదనపల్లి ఛాయాగారు కూడా రామాపురం దాక
కలసి వచ్చారు. ఘాట్రోడ్డులో ఒక బండి బ్రేక్
డౌన్ అయ్యిందని అటుఇటు ట్రాఫిక్ అంత నిలబడిపోయిందని తెలిసింది. మధ్యానమో,
సాయంకాలమో జరిగుంటుంది. వార్త తెలిసి, చాల
వాహనాలు ట్రాఫిక్ జంజాటంలో ఇరుకుపోవటం
ఎందుకని ఆపేసినారు. ఒక్క క్షణం ఇటువంటి
పరిస్థితిలో మనోస్థితి ఎలావుంటుందో ఊహించండి. సరే, రోడ్డు మీద
ఎలాగూ బళ్ళు లేవు కదా
అని మధ్యలో నిలబడి రెండుపక్కల చూస్తూ..ఇప్పుడెట్లా అని ఆలోచిస్తున్న క్షణంలో
..ఒక యువకుడు మోటారుసైకిల్ మీద వచ్చి సరిగ్గా
నా ముందర నిలబెట్టి, కడప
వెళ్తున్నాను, వస్తారా అని అడిగేడు. ఇది
ఊహంచని హఠాత్ పరిణామం. ఈ
పదైదు సంవత్సరాలలో మరి ఏ ప్రయాణంలో
కూడా నాకు ఇలా జరుగలేదు.
సంభ్రమంగా మోటారుసైకిల్ ఎక్కి
కూర్చుని, ఆ యువకునికి దర్గాస్వామి
గురించి నా ప్రయాణ అనుభవాల
గురించి చెప్పాను. సరే, బండి అయితే
ఎక్కానుగాని ఘాట్రోడ్డులో ఏమి జరుగుంది? ఎట్లా
దాటడం? పడిపోయిన బండికి రెండు కిలోమీటర్లు అటుఇటు
వాహనాలు నిలబడిపోయినై. ఆ యువకుడు మోటారుసైకిల్ని
నేర్పుగా పోనిచ్చి పడిపోయిన బండిదాకా తీసుకువెళ్లాడు.. అక్కడ ప్రభుత్వ సిబ్బంది
క్రేను సాయంతో పడిపోయిన బండిని కొంత తొలగించారు. బహుశా
ఆ పని ఒక నాలుగు-అయిదు గంటలనుండి చేస్తున్నట్టున్నారు. ఒక
పదినిముషాలు నిలబడి అది చూసాము. ఎంత
తొలగించారు అంటే..ఒక రెండు
చక్రాల వాహనం పట్టి వెళ్లే
అంత... పోలీసువారు గ్రహించేలోపల ఒక పది వాహనాలు
అటుఇటు వెళ్లారు..అందులో మాది ఒక వాహనము.
మిగిలిన ప్రయాణం సాఫీగా జరిగినది. ఈ సంఘటన జరిగినప్పుడు
మదనపల్లి ఛాయాగారు, నేను రామాపురందాక కలసి
వచ్చాము.
ఇంకొక
సందర్భంలో, ఇట్లాగే కొంత ఉద్వేగంగా కొంత
ఆరాటంగా కడప వచ్చాను. ఎప్పుడు
ప్రైవేట్ బస్సుకు వచ్చేవాడిని. ఈ సందర్భంలో ఎందుకో
ఆర్టీసీ బస్సు ఎక్కుదామని కడప
కొత్త బస్టాండ్ వెళ్ళాను. ఆటోదిగి బస్టాండులోకి వెళ్లి ప్లాటుఫామ్లో చుస్తే ఒక బస్సు రెడీగా
వుంది. సరే
వెళ్లి కండెక్టర్ను ఎదిగితే, "వెళ్ళు, నాలుగవ సీట్ ఖాళీగా వుంది,
అందులో కూర్చో" అన్నాడు. నాకు నోటా మాటలేదు.
కొంత చెమర్చిన కళ్ళతో స్వామిని స్మరణ చూసుకొని దండం
పెట్టుకొన్నాను. ఈ సందర్భంలో రెండు
విషయాలు చెప్పాల్సి ఉంటుంది. మొదటిది, నేను ఒక సాఫ్ట్
వేర్ ఉద్యోగిని.
వైట్కాలర్ ఉద్యోగం. ఎదో మర్యాదగా లైన్లో
నిలబడి టికెట్ బుక్ చేసుకోగలంగాని పదిమందిలో
ఎగబడి తొక్కిసలాటలో నెగ్గుకురాగల తేలివితేటలుగాని నేర్పుగాని వుండవు. రిజర్వేషన్లు లేకండా ప్రయాణం చేసేది చాల తక్కువ. ఒకవేళ
ఉద్యగోపరంగా ఏదన్న ప్రయాణం చేయాలన్న
అన్ని ఏర్పాట్లు ఆఫీసువారు ఘనంగా చేసి పంపిస్తారు.
అందువల్ల ఆర్టీసీలో రిజర్వేషన్ లేకండా ప్రయాణం చేయాలంటే కొంత బెరుకు. రెండవది,
దర్గాలో సాంవత్సరిక ఉత్సవాలలో ఎక్కువ భాగం భక్తులు ఉత్సవానికి
వచ్చి ఒకపూట, రెండుపూటలు, లేదా ఒకటి-రెండు
రోజులు ఉండి వెళ్లేవారు.
ఎవరన్నా భక్తులు ఉత్సవానికి ఒకటి-రెండు రోజులు
ముందు వచ్చి, ఉత్సవం తరువాత ఒకటి-రెండు రోజులు
ఉండి వెళితే స్వామి చాలా సంతోషపడేవారు. ఇటువంటి
సందర్బాలలో అయన కరుణ ప్రస్ఫూటంగా
కనపడేది.
నా
పెళ్ళైన కొత్తలో, ఒక ప్రయాణంలో, ప్రొద్దటూరు
శివ అన్న వాళ్ళు దర్గా
నుంచి కడపలో దించారు. అది
ఒక మారుతి ఓమ్ని బండి. చాల
కార్ల మీద ఇది సన్నగా
ఉంటుంది. ఈ ప్రయాణంలో ఘాట్రోడు
దాక, ప్రయాణం సాఫీగానే సాగింది. ఘాట్రోడ్డులో ఒకలారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. వాళ్ళు కొంత నేర్పుగా బండిని
ఉన్న చిన్న గ్యాప్లో నడిపినప్పు
గమనిస్తే, బహుశా ఆ గ్యాప్లో
ఒక ఓమ్ని బండి మాత్రమే
పోగలుగుతుంది. అంత చిన్న గ్యాప్.
అది ఇంకా ఏ మాత్రం
తక్కువగా వున్నా బండిని నిలబెట్టాల్సి వచ్చేది. లేదు మరే ఇతర
కారులోనో బుస్సులోనో వచ్చిఉంటే
నిలబడిపొయ్యేవాళ్ళము.
ఇంకొక
సందర్భంలో కడపకు చేరి, ఐయిదు-ఆరు ట్రావెల్స్లో అడిగి
చుస్తే ఎక్కడ టిక్కెటు దొరకలేదు.
ఇదేమిట్రా భగవంతుడా, అని కొంత అయ్యోమయ్యంగా
నిలబడి చూస్తున్న సమయంలో, శివరామకృష్ణ రెడ్డి గారు ఎదురుపడ్డారు. ఈయన
సేవాభావంగల వ్యక్తి. రిటైర్డ్ ఉద్యోగి. అయన ఎవరో ఒక
యువకుడిని వెంట పెట్టుకుని వెళ్తున్నారు.
మాట్లాడగా నా పరిస్థితి చెప్పను.
ఆ యువకుడు ఒక పది నిముషాలు
అటుఇటు వెళ్లి ఒక బస్సులో సీటు
ఏర్పాటు చేసానని చెప్పాడు. ఆ రోజు వారి
సహకారం లేకపోతే నా వల్ల అయ్యేది
కాదు. బస్సు ఎక్కి ఏ
సీటు అంటే, డ్రైవర్ క్యాబిన్లో
పైన ఒక బెర్త్ వుంది.
మాములుగా బసుకు ఇద్దరు డ్రైవర్లు
వుంటారు. ఒక డ్రైవర్ కర్నూల్
దాక 220 కిలోమీటర్లు నడిపి పడుకుంటాడు. రెండవ
డ్రైవర్ మిగిలిన దూరం పూర్తి చేస్తాడు.
నాకు ఆ బెర్త్ ఇచ్చారు.
అది కొంత ఇరుకుగా ఉండి
ఎక్కటానికి ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది, చూడంగానే. ఆశ్యర్యంగా అది తెలికిగా ఎక్కి
పడుకుంటే చాల సౌకర్యంగా ఉంది.
మంచి నిద్ర పట్టింది.
No comments:
Post a Comment