Swami on Ammaya



అమ్మయ్య చాల గంభీరమైన వ్యక్తి. చాల తక్కువగా మాట్లేడేవారు. ఎప్పుడు జపంలోనో/ధ్యానంలోనే ఉన్నట్టు ఉండేవారు. ఒక జ్ఞానాపురుషుని గుర్తించటం, వారిని గూర్చి చెప్పటం అనేది మరొక జ్ఞానికి మాత్రమే సాధ్యపడే విషయం. సామాన్యులు చెప్పటం కష్టం లేక అసాధ్యం. సిద్ధపురుషులు పరమపదించినాక వారిని సంప్రదాయం ప్రకారం సమాధి చేస్తారు. సమాధి చేసిన తరువాత నలభైవరోజు "మండలరాధన" అని కార్యక్రమం చేస్తారు. తరువాత ప్రతి సంవత్సరం వారి ఆరాధన చేస్తారు. అమ్మయ్య మండలరాధన రోజున స్వామి ఒక పదైదు నిముషాలు మాట్లాడినారు. దానిని రికార్డు చేసినారు, రికార్డు నుంచి స్వామి చెప్పిన విషయాన్నీ ప్రతిలిఖించి కింద ఇవ్వడమైనది. వీడియోను చూచుటకు ఆసక్తి వున్నవారు అంతర్జాలంలో 
https://youtu.be/Ip-c-75MTC0 ను దర్శించవచ్చు

"అదే ఒక వస్త్రంతోటి ఆరేసుకుని అట్లే వుండినాము. ఎలాటిది ఎం కోరలేదు మహాతల్లి. దర్గా దగ్గర వుండే సత్రం దెగ్గరే మూడేళ్లు వుండినాము. తరువాత ఒక స్థలం తీసుకున్నాము. ఇక్కడ ఒక కొట్టం కట్టుకుని వున్నాము. అరవైఐదు-అరవైఆరు లో ఇక్కడ కడుతున్నాము. మన దేశ అధ్యక్షుడిని (ఇక్కడ ఎదో చెప్పదలుచుకుని ఆగినారు. 1965లో భారత-పాకిస్థాన్ల యుద్ధం జరిగింది.) ..అంగడి ఉంటే, వద్దంటే వినకుండా బొంబాయి పోయినారు, అక్కడ వెండి పోయింది. వెండి పొతే తట్టులో వున్నవాళ్ళంతా ఎగతాళి చేసారు, వెండి పోయింది ఆహారం పెడతారా? ఉర్సులో భోజనాలు పెడతారా లేదా? అని ప్రశ్నించారు. ఊళ్లోకి ఇట్లా అంటు అయిపోతే ఎన్ని కావాలో అన్ని అడిగినారు తల్లిని. ఆయమ్మ ఒకేమాట చెప్పింది "ఒక్క బియ్యంగింజ ఒక్క రూపాయి అయితే తెచ్చిపెడతాము" అట్లాంటి చోట వాదించింది. తాను భకితో, కరుణతో, ప్రేమతో వచ్చినవాళ్ళను చూస్తూ, ఒక సంవత్సరం నుంచి వంట చెయ్యకుండా పిల్లలు ఆహారం పెడితే ఆహారమే తింటాను అని పట్టుబట్టిన పుణ్యవతి, శీలవతి, గుణవతి, ధర్మవతి, సత్యవతి.

ఇటువంటి తల్లి మరుగైందని బాధేమీలేదు. ఆయమ్మ ఎవరిచేత నీళ్లు తాగనివ్వలేదు. మా ముగ్గురు, మేము అన్నదమ్ములం. వాళ్ళు ఇద్దరు ఇచ్చారు. (అమ్మాయవాళ్ళ తోడికోడళ్ల  చేతి మీద ఏదన్న ఇస్తే తిన్నారు అని భావం) కడపలో తలుపుల మల్లికార్జున రెడ్డి భార్య ఇక్కడకి వచ్చి వస్తే, ఆమె ఏదైనా అంత రొట్టె చేస్తే, పాలిస్తే తగినది గాని, వాళ్ళ కొడుకులచేత, బిడ్డలచేత, ఎవరిచేత గాని తాగలేదు తినలేదు. కంటికి రెప్పగా శరీరాన్ని చూస్తావచ్చింది. పన్నెండు మాసాల ముందు మాకు అర్థంలేని ఒక స్థితిని తెచ్చిపెట్టినాడు పరబ్రహ్మ్మము, పరమాత్ముడు, సద్గురుమూర్తి. ముఖమంతా పగులకొట్టారు ఎవరో(సింబాలికగా చెప్పినట్టు), అది ఏమో తంత్రమో, మంత్రమో, యంత్రమో, ఖర్మమో మిగతావి యేవో తెలియదు. అందరితో చెప్పుకుంది మహాతల్లి. "ఒక్క పూట కూడా తినలేదు,పాలు కూడా తాగలేదు, పదైదురోజులైంది" అని చెప్పింది. డాక్టర్ బయారెడ్డి, బయారెడ్డి భార్యను రమన్నారు. వారు చూసారు, కడుపులో ఏమైందమ్మా అన్నారు. నవ్వినాడు, స్వామి! అమ్మాయ వచ్చి " ఆహ్! ఆయనకు ఏముందయ్యా! అయన ఎం తింటున్నాడని చెప్పాలి " అని చెప్పింది మహాతల్లిఅప్పుడు బయారెడ్డి వాళ్ళు వచ్చి, ఆడ పండుకుంటే, వాళ్లిద్దరూ వచ్చి డాక్టరు,డాక్టరమ్మ వచ్చి చూసారు. "నాయనా, ఒకటి చెప్పు నాయనా!" అన్నాడు "బ్రహ్మ మురారి సురార్చిత లింగంనిర్మల భాసిత శోభిత లింగం!!" అని  నా పొట్టమీద చెయ్యిపెట్టి చెప్పండి నేను వచ్చి కూర్చుంటాను అది పోతుంది అని. చెప్పాడు. తరువాత ఏమి లేదు. బాగైంది

ఆహారంలోనే నియమము. నాకు మా గురువుగారు 1960లో, కడపలో అవధూత వున్నడే, చెంప మీద ఒక పెట్టు పెట్టాడు. అక్కడనుంచి వెళ్లిపొమ్మన్నాడు, కానీ డెబ్బైఎనిమిదివరకు అక్కడ ఆగివున్నాడు. ఆయనెం చేసినాడు తెలుసా? నాకు లంబికాయోగాన్ని ఇచ్చాడు. పెద్దనాలుకను లోపలపెట్టి చిన్ననాలుకతో జతపరిచాడు. ఆకలిదప్పులు దూరమై, అనంతకోటి స్వరూపమైన, పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్ముని యొక్క లీలలో వుండేటట్టు, బయలు ప్రదేశానికి మా ఇద్దరినీ చేర్చాడు.
  పరాప్రకృతి, జగన్మాత, తను ఎవరి గొప్ప చెప్పాలని తన పిల్లలను పిలిపించుకుంది. ఎప్పుడు పదోతేదీ రాత్రికి అందరిని పిలిపించుకుంది. మరిది పిల్లలను, కొడుకులను, కోడళ్లను. "ఎవరమ్మా? స్వామిని చూస్తారు?" అంది. వాళ్ళకు అర్థం కాలేదు. "సరే! మీరందరు భోంచేసి వెళ్లిపోండి" అంది. తెల్లవార్ల పన్నెండు గంటలకు అందరిని పంపించేసింది. తాను భోంచేసింది. నేను ఆహారం తీసుకున్నాను, బాగున్నాను అన్నాను. పన్నెండు గంటలప్పుడు దర్గాలో ఒక లోటా పాలు ఒక లోటా నీళ్లు పొయ్యమని చెప్పింది. అక్కడ వున్న పిల్లకాయలకి, వీళ్ళు బ్రహ్మపడి, "అమ్మా! నువ్వు కలవర పడుతున్నావు!" అన్నారు. "నేను కలవర పడలేదు నాయనా! బాగున్నాను చూడండి. ఒక లోటా పాలు ఒక లోటా నీళ్లు పెట్టండి" అని చెప్పింది తల్లి. తరువాత మూడయింది, పాలిమనింది. చిన్ముద్రతో ఇలా చేసుకుంది, లోB.P. అన్నారు. పరమాత్ముడిలో ఐక్యయమైంది. వాళ్లంతా డాక్టర్లు వచ్చి చూసారు, పది నిముషాలు అయిదు గంటలు అన్నారు. కాదు, ఏడూ పదైదు గంటలకు, ఏడూగంటల పదైదు నిముషాలకు పరమపదించింది.  

ఆరుగంటలకు ఇక్కడ బయారెడ్డి, బయారెడ్డి భార్య వచ్చారు, నన్నురమన్నారు, రాత్రి పన్నెండు గంటలకు నా వళ్ళో వచ్చి కూర్చుంది. ఇక్కడ కూర్చుంది. ఇక నేను ఎక్కడికి పోవాలా? ఎవరి దెగ్గరికి పోవాలాఏమని అడగాలా?"  మీరు పోండి, చుడండి, బాడీ ఎత్తుకొని రాండి, ఆమెను తీసుకొని రండి, అంతే  కానీ నేను అక్కడికి ఎక్కడికి వచ్చేదానికి లేదు" అని నాలోనించి పలికించాడు  పరమాత్మ, పరబ్రహ్మము, సద్గురుమూర్తిఆయమ్మ డాక్టరు దెగ్గరికి పోవాలంటే ముందు పర్మిషన్ తీసుకోమనిన్ది.  "అమ్మ, అయ్యా పొమ్మన్నాడు అన్నారు. ఎక్కడికన్నా, మద్రాసుకు, ఎక్కడికన్నా పోవాలంట అమ్మ, డాక్టర్ చెపితే ఒప్పుకోవాలంట" అని చెప్పారు. "ఆయనను అడగండి అనింది". ఆయనకు వీళ్లు ఫోన్ చేస్తే ఎం చెప్పాడు, "శనివారం, ఆదివారం ఆమెను అక్కడినుంచి తరలించేదానికి లేదు. ఆమెను అక్కడినుంచి కదిలించద్దు వద్దు వద్దు వద్దు వద్దు" ఎందుకు వద్దన్నాడొ ఏమో పరమాత్మునికి ఎరుక. ఇక్కడ నుంచి రామాపురంలో నుంచి కార్లో వస్తావుంటే, ఇక్కడనుంచి ఒకరిని పంపించారు. దూరదర్శంలోనే సాయి దాంట్లో నా యొక్క జీవితాన్ని రంగారావుగారు, K.V. రంగారావుగారు అని అయన పబ్లిష్ చేసి వున్నాడు. వాళ్ళు హైద్రాబాద్లో, సాయీ దూరదర్శన్లో, ప్రింట్ చేసారు, రోజే వచ్చింది. మాస్టర్ భరద్వాజ చేసిన సాయీ పుస్తకము వచ్చింది. రెండు తల్లి చేతికి పంపించాము, తల్లి తన దెగ్గర పెట్టుకుంది, అటు పరమాత్ముని చూసింది, ఇటు శరీరానికి అధికారిగా వున్న వ్యక్తిని చూసింది. తనలోతాను పరమాత్ముని ధ్యానం చేసి నిష్క్రమించింది. సమాధిలో పోయింది, నిర్వికల్ప సమాధిలో సద్గురుమూర్తిలో కలిసింది. మహాతల్లిని గూర్చి నేను చెప్పేదానికి ఎం లేదు. స్వార్థమైతుంది. నేను ఆయమ్మను, ఆయమ్మ వచ్చి నాలో వుంది కాబట్టి, ఎం చెప్పేదానికి ఏంలేదు నాయనా.

తొట్టతొలి ఇలా వచ్చింది. చెయ్యి వేసినందుకు ఎంతమంది అన్నారో, ఎన్ని మాటలన్నారో, ఆమె అండగా వున్నప్పుడే నేను ప్రపంచంలో వుండేదానికి ఉంటుంది. పరాప్రకృతి లేనప్పుడు ఎక్కడ ఎక్కడ ఉంటాడో పోతూ పోతూ యాభైయేడులో చెప్పుకుంటూ చెప్పుకుంటూ ( కొట్టంలో)? వున్నాడు. ఈమెకి యాభైతొమ్మిదిలో కుడికాలికి  దెబ్బతగిలింది, ?? అప్పుడు మాకు అన్ని ఇచ్చాడు, కన్నతండ్రి మహాతల్లి వచ్చి కాపాడింది. కుప్పం అయన సుబ్బరాయడు వచ్చి అమ్మకు దెబ్బ తగిలింది అంటే, "చావలేదు పోరా!" అన్నాడు. అట్లాంటి ఆమె చనిపొయిన్దియ్యఏమిలేదు పోతుంది మూడు గంటల్లో అన్నాడు, బాగైంది మహాతల్లి. కుడికాలు ముందు దెబ్బతీసింది, కుడికాలు దెబ్బతీసినప్పుడు శరీరము వదిలిపోతుంది అని భయపడింది. లేదుఅరవైఏడులో మళ్ళీ అయితుంది అని చూసింది. ఇద్దరమూ పోటీ చేసాం. పోటీ చేస్తే పరమాత్ముడు " జలరూపంతో మాత్రం కాదు, నాయన! వచ్చిన పని పూర్తి అయినా తరువాతనే అన్నాడుతాను వచ్చిన పని పూర్తి అయితే సరైన రీతిలో ఔతుంది.

అదే విధంగా మహాతల్లి విష్ణుసంజాతురాలు, ఆమె జలతత్వంలో పోయింది, నాది రుద్రతత్త్వం నాయన! మేమిద్దరమూ ఒక్కట్టె, మహాలక్ష్మి ఒకటే రుద్రుడు ఒకడే, వాడినివిడిచి ఈమె వుండలేదు, ఈమెను విడిచి వాడుండలేడు. ఇద్దరు ఒకే భావన. "ఏకమేవాద్వితీయంఒక వస్తువు రెండు అయ్యింది కానీ రెండు ఒకటి కాదు. "సద్గురుమ్ తమ్ నమామి! సద్గురుమ్ తమ్ నమామి! " మహాతల్లి, త్యాగశీలతతో, పట్టుదలతో, చేతలతో మనకు చూపించిన రస్తాను, మనమందరమూ కూడా చేస్తే మనలోపల వున్నా సత్యం  మనందరమూ కూడా తెలుసుకుని, ప్రతి జీవిని ప్రేమించే తత్వాన్ని మహాతల్లి చాటిచెప్పింది.
అన్ని జీవుల్ని సమత్వంతో చూసినప్పుడు, ప్రేమతో చూసినప్పుడు, ప్రేమతత్వాన్ని మనలో ఇముడ్చుకుంటే సద్గురువు సాయి యొక్క మహాత్తు అంతా మన ఒళ్ళులో ఇముడుతాయి. సాయియే కాదు,   మహామతుని చరిత్ర తీసుకున్న వారి యొక్క లీలలలో కూడా భక్తి కలుగుతుంది. భక్తితో మనము నిరంతరము కృషి చేస్తేవాక్ మౌనం వస్తుంది, వాక్ శుద్ధి అయ్యింది అంటే, అందరూ నిన్ను గౌరవిస్తారు. ఎదుటివారిని దూషించకుండా ప్రేమతో వుంటూ, మనసును అరికట్టేమంటే, దీనియొక్క ఆత్మసాక్షాత్కారాన్ని చూసేదానికి కూడా అయితుంది. "మనసు అంటే ఏంటయ్యా?" అంటే, ఇక్కడ మీ అందరితో మాట్లాడుతున్నాడు. రోడ్డులో ఎవరో వస్తాడు అని ఇక్కడ మట్లాడుతో  వెళ్ళిపోతున్నాడు. వీరబ్రహ్మంగారు ఎం చెప్పారంటే, ఒక చిన్న పని చేసారుఅయన మనుమరాలు ఈశ్వరమ్మ దగ్గర వున్నాడు. "అమ్మా! భోజనం చేస్తానుఅన్నాడు. ఆకు వేసింది. అన్నం చేత పట్టుకుంది. మహాత్ముడు ఎం చేసేడంటే, దున్నపోతుకు మాలవాడకు పోయాడు. శరీరం ఇక్కడే వుంది. మాలవాడకు పోయి వాళ్ళ ఎంగిలి  తినొచ్చి, నాకు ఓర్పు లేదంటే ఎట్లా? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రే గురువులు, అప్పుడు ఈశ్వరమ్మ ?? "అమ్మా! ఇంకా వడ్డీలేదే?" అన్నాడు. "నువ్వు మాలవాడకు పోయి తినొస్తే, నేనెట్లా వడ్డిచేదప్ప అని?" అంది.  "! అట్లనా తల్లి, నేను చేయలేని పనులన్నీ నీవు చేస్తావు" అని తల్లికి, మహామాత్ముడు ఆయమ్మను ఆదేశించాడు.

ఇప్పుడు మహాతల్లి ఏమి చేసిందంటే, శరీరాన్ని .. తల్లి అయిదు సంవత్సరాలు బంగారుతో దత్తాత్రేయుడు రూపాన్ని నాకు ఇవ్వాలనిన్ది. అంతట్లో ఆమె పోయింది, శరీరం.ఇక ఆమె చెప్పిన పని పూర్తి  చేసేదానికి, కాయాన్ని సద్వినియోగం చేసుకుని, అయితే అప్పుడప్పుడు వచ్చి దీని రెచ్చగొడితే మీ వెంటవస్తాడు, మీతో మాట్లాడతాడు, వస్తాడుమౌనంగా ఉంచితే ఏమి కదలకుండా ఉంటే, ఎప్పుడు ఏది?? మౌనంగా వుండటనికి లేదు. కదిలించేదానికి కావాలి విధంగా చేస్తే శరీరాన్నిమీ అందరికి సహకరిస్తాడు.   మీరందరు శ్రద్ధతో పట్టుదలతో పరమాత్ముని ధ్యానంచేసి, సద్గురువును, ఆదయ సద్గురువు, సద్గురువు, సద్గురు అంటున్నావేంటి అంటే సత్యమైనది  గుణములు లేనిది. అది ఏది కాదు.  "హంసాత్మకం పరమహంస విహార లీలం" ఏడూ పీఠములున్నాయి. ఇది ఎప్పుడు అంటే ?? S.M. రావు / రామం గారు అయన కర్నూల్ పోయినాడు 68-69లో, అక్కడ అయన అంత్య ఘడియలు వచ్చినై. వారు విచారించారు, నేను ఫలానా అయన శిష్యుడిని అని అయన ఘంటాపధంగా చెప్పాడు, చెపితే నేను ఇక్కడి నుంచి బయల్దేరి, పిలుపు వస్తే కడపకు పోయాడు, కడపకు పోయి అక్కడి నుంచి వాళ్లకు చెప్పాడు


ఏడూ రకాలైన పీఠాలు మన ప్రాంతంలో వుంది. అప్పుడు "హంసాత్మకం పరమహంస విహారలీలం" అని చెపితే, అయన చెప్పిన రెండు మూడు గంటలోనే పరమపదించాడు. ఆయనకు తీసుకు వచ్చారు. వస్తున్నారు అని తెలిసిందిఅక్కడకుపోయి చూసేసి ఆయనను సరైన పద్దతిలో సద్గురువు దగ్గరకు  చేర్చాము, శరీరంతో. చాల పట్టుదలగా మహనీయుడు, అతడు ఎన్నో చేసాడు. రాష్ట్రపతి సంజీవరెడ్డికి చాల దగ్గరవాడు. అతడు అన్నిపనులు చేసాడుఒక డ్రామాలేకాదు. ప్రతి ఒక్క కళ్లలో కూడా చేసి ? శ్రీ సద్గురు మాతాజీ అని ఆమె పేరిట పెట్టాము, ఇరవైమూడు మంది మెంబర్లుగా చేరి చేస్తున్నారు. స్కూల్ను నడిపేదాన్నికి కూడా కంకణం కట్టుకున్నారు. స్కూల్ యొక్క లక్షణంగా చేసేదానికి పట్టుదల, శ్రద్ధతో, అందరు కలసి చేస్తున్నారు.మనం లేం, వారున్నారు అనుకోవద్దుప్రతివారి రక్తంబొట్టు ఇక్కడ వుంది. మీ రక్తంబొట్టులో సద్గురుమూర్తి  ఆడుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపుడు, పరమాత్ముడు వున్నాడు. కాకపోతే, ఓర్పుతో నిగ్రహశక్తితో ఆచరించారంటే అన్ని జయప్రదమైతై.. తొందరపాటు లేకండా చేయాలని మిమ్మల్నందరిని ప్రార్థిస్తున్నాను. స్కూల్ను అభివృద్ధికి తెచ్చి ఆమె యొక్క ఆత్మకు, ఆమె స్కూల్లోనే భోజనాలు పెట్టించింది. ఇటువంటి పుణ్యవతిని మనము రూపంతో చూస్తాము అంటే తల్లి మన కంటిచూపులోనే వుంది. మనము జాగ్రత్తగా చేసుకుంటే జయమౌతుంది.  

No comments:

Post a Comment